
'అగ్నిసాక్షి', 'సర్వమంగళ మంగళ్యం', 'అనురూప', 'సుందరి' వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు, కన్నడ ప్రేక్షకులకి అభిమాన నటిగా మారిపోయింది ఐశ్వర్య పిస్సే. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తన భర్త హరి వినయ్‌తో ఉన్న ఏడేళ్ల దాంపత్య జీవితానికి అధికారికంగా ముగింపు పలికినట్లు వెల్లడించారు. 2019వ సంవత్సరంలో పెద్దల అంగీకారంతో మైసూరుకి చెందిన హరి వినయ్‌ని వివాహం చేసుకున్న ఐశ్వర్య,హరి కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగానే కాపురం సాగించారు. అయితే గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా, వేర్వేరుగా నివసిస్తూ వస్తున్నారు. పరస్పర అంగీకారంతోనే ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రణబాలి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యో: టాక్ ఇదే..ఇచ్చిన సర్టిఫికెట్ ఇదే!
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల వదంతులపై కూడా ఐశ్వర్య స్పందించారు. 'నా జీవితం, నటించే క్యారెక్టర్స్ పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయి. కానీ నా వ్యక్తిగత జీవితం పూర్తిగా నా ప్రైవేట్ విషయం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ , ఎంగేజ్‌మెంట్స్ పెంచుకోవడం కోసం కొందరు నిరాధారమైన, తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. సీరియల్స్‌లో నేను నటించే సన్నివేశాలని, నిజ జీవితానికి ముడిపెట్టి అసత్య ప్రచారాలు చేయడం సరికాదు. ఈ కష్టకాలంలో నాకు,నా కుటుంబానికి కావలసిన మనశ్శాంతిని, గోప్యతని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా, నిబంధనలను అతిక్రమించి తన పరువుకు భంగం కలిగించేలా లేదా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే డిజిటల్ మీడియా ఛానెళ్లు మరియు వ్యక్తులపై తగిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఇకపై తన కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టనున్నట్లు ఈ ప్రకటన ద్వారా ఐశ్వర్య స్పష్టం చేశారు.
[Aishwarya Pisse Divorce Hari Vinay, Aishwarya Pisse divorce, Hari Vinay husband, Aishwarya Pisse marriage end, Kannada TV actress divorce, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






