ఇంకో జన్మ ఎత్తినా మారరు.. హీరోయిన్ సంచలన కామెంట్స్!
on Oct 15, 2024
తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతకాలంగా తెలుగు నటి రేఖ భోజ్ గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తెలుగు అమ్మాయిలను హీరోయిన్లను తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ మూవీ లాంచ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. "వీళ్ళిద్దరి వల్ల ఒక పది టికెట్స్ కూడా ఎక్సట్రా తెగవు. అయినా సరే ఇలాంటి చిన్న ప్రాజెక్ట్స్ కి కూడా తెలుగు అమ్మాయిలను కాదని ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్స్ అండ్ భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ.... మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు. వీళ్ళింతే ఇక. చివరికి లాస్ట్ లైన్ హీరోస్ ఆయిన సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళ పక్కన కూడా తెలుగు అమ్మాయిలు లేరు." అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read