Home

»

Latest News

పెళ్లిపై టాప్ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. ఆనందంగా ఉండాలంటే అది చాలు

Sep 8, 2026 7:43PM

 

నందమూరి  కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమన్యు తో తెలుగు పరిశ్రమపై టేక్ ఆఫ్ అయిన  భామ 'రమ్య' ఉరఫ్ దివ్య స్పందన. కన్నడ సినీ రంగానికి చెందిన రమ్య అక్కడ అనేక హిట్ సినిమాల ద్వారా భారీ అభిమాన ఘనాన్ని సంపాదించింది. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపి)  గా  కూడా  నిలిచిందంటే రమ్య సినీ హవా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.


 రీసెంట్ గా రమ్య ఇచ్చిన  ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే రమ్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. రమ్య మాట్లాడుతు 'అసలు పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యమా? ఖచ్చితంగా కాదు! నా వ్యక్తిత్వాన్ని, నా గుర్తింపుని పెళ్లి నిర్ణయించలేదు. వివాహం చేసుకోకుండా కూడా మనుషులు చాలా సంతోషంగా జీవించగలరు. సమాజం తరచుగా వ్యక్తులకి  రెండు ప్రతిపాదనలు మాత్రమే ఇస్తుందని, "ఒకటి మీరు వివాహం చేసుకోవాలి, లేదా మీరు సంతోషంగా ఉండాలి" అని చెబుతుందని, అందులో మనకు ఏది కావాలో మనమే ఎంచుకోవాలి. అయితే ఈ అభిప్రాయం అందరికీ ఒకేలా వర్తించదు. పెళ్లి బంధాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించడం లేదు.

 

 

Also Read: ఇద్దరిలో గెలవబోతుంది ఎవరో తెలిసిపోయింది: ఎందుకంటే ఆ సీక్రెట్ బయటకొచ్చింది! 

ఇద్దరి వ్యక్తుల మధ్య మంచి స్నేహం, ఒకే రకమైన జీవిత సూత్రాలు, విలువలు, ఒకరిపై ఒకరికి లోతైన అవగాహన ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం ఎంతో అందమైన అనుభవం. కానీ కేవలం సామాజిక ఒత్తిడికి లొంగిపోయి, ఏదో ఒక వయసులో పెళ్లి చేసుకోవాలనే కారణంతో మాత్రమే బంధంలోకి అడుగుపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.  రమ్య వయసు ప్రస్తుతం 43 ఏళ్ళు. అసలు పేరు దివ్య స్పందన. స్క్రీన్ నేమ్ రమ్య. 

 

 

[Ramya , Divya Spandana, Maarriage, Kalyan Ram, Happiness, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News ]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com