Home

»

Latest News

పూల పండుగలో లయ సందడి.. తెలంగాణ సంస్కృతిని చాటుతూ స్పెషల్ పోస్ట్‌!

Oct 14, 2026 2:31PM

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ లయ కూడా బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై, బతుకమ్మ పండుగను జరుపుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

బతుకమ్మ పూలను అందంగా పేర్చి పూజలు చేసిన లయ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూలు, మహిళల గొప్పతనం, తెలంగాణ అందమైన వారసత్వానికి బతుకమ్మ పండుగ ప్రతీక అంటూ తన పోస్టుకు క్యాప్షన్‌ కూడా జతచేశారు. దీంతో ఆమె షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న లయ, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాహం తర్వాత కుటుంబంతో విదేశాల్లో నివసించిన ఆమె, మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. నితిన్‌ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’, ‘వదలా’, ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నారు. 

ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న లయ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బతుకమ్మ వేడుకల వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు.

 

 

[Actress Laya, Laya Bathukamma Celebrations, Laya Bathukamma Video, Laya Viral Video, Telugu Actress Laya, Laya Traditional Look, Bathukamma Festival 2026, Laya Latest News, Tollywood Actress, Telangana Festival]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com