ENGLISH | TELUGU  

ఆ హీరో, డైరెక్టర్‌ అడిగిన దానికి నో చెప్పాను.. అదే నాకు బ్యాడ్‌ అయింది!

on Feb 3, 2025

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు, కొందరు నటీమణులు ఈ విషయాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇటీవలికాలంలో మీటూ వేదికగా ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్‌ బిగినింగ్‌లో జరిగిన ఎన్నో వేధింపుల గురించి అందరితో షేర్‌ చేసుకున్నారు. అయితే ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అంటూ కొట్టి పారేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొందరు నటీమణులు సినిమాలతో సంబంధం లేకుండా వార్తల్లోకి ఎక్కుతుంటారు. తమ సినిమా కెరీర్‌ ఎలా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలోని వారి ప్రవర్తన ద్వారా బాగా ఎక్స్‌పోజ్‌ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్‌కి కూడా గురవుతుంటారు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. 

మొదట టీవీ రంగంలో తన సత్తా ఏమిటో చూపించిన అనసూయ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆమె చేసిన విలక్షణమైన క్యారెక్టర్స్‌ ద్వారా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎంతో పాపులారిటీ తెచ్చుకొని ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న తర్వాత ఆమె చేసిన ఆ క్యారెక్టర్స్‌ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. టీవీ ప్రోగ్రామ్స్‌, సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అనసూయ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె పెట్టే పోస్టుల వల్ల ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఇంటర్వ్యూలలో నోరు జారి ఆమె చేసిన కామెంట్స్‌ వల్ల కూడా నెటిజన్లకు టార్గెట్‌ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

ఈ ఇంటర్వ్యూలో మరోసారి మీటూ అంశాన్ని లేవనెత్తి.. ఆ విషయంలో తను ఎంత నష్టపోయిందీ వివరించింది. తనను ఓ దర్శకుడు, ఓ హీరో కమిట్‌మెంట్‌ అడిగారని, దానికి తాను నో చెప్పానని అంటోంది. అలా నో చెప్పడం వల్ల తాను చాలా కోల్పోయానని బాధగా చెబుతోంది. దానికి ఉదాహరణగా పవన్‌కళ్యాణ్‌ సినిమా గురించి చెబుతూ.. ఓ సినిమాలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి సాంగ్‌ చేసే అవకాశం వచ్చిందని, అలాంటి పాటలు చేయకూడదన్న ఉద్దేశంతో నో చెప్పానని తెలిపింది. అయితే తాజాగా హరిహర వీరమల్లు చిత్రంలో ఆమెకు మళ్ళీ అలాంటి అవకాశమే వచ్చింది. దానికి మాత్రం తాను ఓకే చెప్పానంటోంది. నాగబాబుతో జబర్దస్త్‌ చేశానని, చిరంజీవితో నటించానని, అలాగే చరణ్‌తో చేశానని, అందుకే తనను మెగా కాంపౌండ్‌ నటి అంటారని చెప్పడం అందర్నీ మరోసారి ఆలోచించేలా చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచిన అంశం.. ఒక డైరెక్టర్‌కి, హీరోకి నో చెప్పడంవల్ల తను చాలా నష్టపోయానని చెప్పడం. అయితే అది ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.