Home

»

Latest News

Sivaji Raja: శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం 

Mar 03, 2026

 

-ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు 
-ఈ రోజు ఉదయమే జరిగిన సంఘటన 
-శివాజీ రాజా కి పరామర్శల వెల్లువ 


ప్రముఖ నటుడు 'శివాజీరాజా'(Sivaji Raja)కి సినీ రంగంతో ఉన్న అనుబంధం సుదీర్ఘమైనది. పది మంది నటుల్లో ఒకడిగా కాకుండా శివాజీ రాజా అనే ప్రత్యేకమైన నటుడు ఉన్నాడనే కీర్తిని ప్రేక్షకుల నోటి నుంచి వచ్చేలా చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఆయన తండ్రి  చనిపోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం 

 శివాజీ రాజా తండ్రిపేరు రామరాజు. వయసు ఎనభై ఐదు సంవత్సరాలు. వయోభారంతో వచ్చే సమస్యల వల్ల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరికి పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని మధురానగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.దీంతో పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు రామరాజు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ శివాజీ రాజా కి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఉన్న మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్టుగా తెలుస్తుంది.

Also read: Peddi: రయ్ రయ్ రా రా సాంగ్ రెస్పాన్స్ ఇదే.. కావాలనే వాళ్ళని టార్గెట్ చేసారు

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com