నువ్వు రేప్ చేయకపోతే..నేనే రేప్ చేసేస్తా అన్న హీరోయిన్
on Nov 30, 2022
సత్యప్రకాష్ ఆ రోజుల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. తనదైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. సత్యప్రకాష్ డైలాగ్ డెలివరీ ఎవ్వరినైనా ఇట్టే ఎట్రాక్ట్ చేసేది. ఐతే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఆయనకు అవకాశాలు తగ్గాయి. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు.
" రేప్ సీన్స్ అంటే అసలు నాకు నచ్చేవి కావు. కానీ అప్పట్లో ఈ సీన్స్ నేను చేయను అని చెప్పే స్థోమత నాకు లేదు. ఎందుకంటే అప్పటి మూవీస్ లో అవే కీలక పాత్ర పోషించేవి. కానీ ఇవ్వాల్టి, రేపటి మూవీస్ లో అలాంటి రేప్ సీన్స్ లేవు. జనాలు రేప్ సీన్స్ చూసి ఎట్రాక్ట్ అయ్యే స్థాయిని దాటిపోయారు. "పెళ్లి చేసుకుందాం" మూవీలో వర్షం పడేటప్పుడు సౌందర్యను రేప్ చేసే సీన్ అనేది ఇప్పటికీ జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో రమ్యకృష్ణ గారితో కూడా ఇలాంటి ఒక రేప్ సీన్ చేసాను. ఐతే ఈ రేప్ సీన్ కి చాలా టేక్స్ తీసుకునేసరికి ముత్యాల సుబ్బయ్య గారు తిట్టారు. తర్వాత రమ్యకృష్ణ గారు "సర్ మీరు ఎస్ అంటే చాలు నేనే సత్యప్రకాష్ ని రేప్ చేసేస్తా" అన్నారు... చెప్పాలంటే రమ్యకృష్ణ గారు చాలా డేరింగ్ మనిషి. ఇది యాక్టింగ్ మాత్రమే కాబట్టి చెయ్యి అని ఎంకరేజ్ చేశారామె. ఐతే ఆమె అప్పటికే చాలా బిగ్ స్టార్. ఐతే అప్పటికి నేను అప్ కమింగ్ యాక్టర్ ని కాబట్టి కొంచెం టెన్షన్ అనేది ఉండేది. తర్వాత ఆమె నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేసరికి నేను ఆ రేప్ సీన్ చేయగలిగాను" అని సత్యప్రకాష్ అప్పటి ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చారు.