నెలకు 40 లక్షలు.. స్టార్ హీరోకి షాకిచ్చిన భార్య!
on May 21, 2025
తమిళ హీరో జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తాను పంజరం నుంచి బయటపడ్డానంటూ రవి ఒక లేఖ విడుదల చేయగా, దానికి పోటీగా మా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం మూడో వ్యక్తి అంటూ ఆర్తి మరో లేఖ విడుదల చేసింది. ఇక వీరి విడాకుల వ్యవహారం తాజాగా మరో మలుపు తీసుకుంది.
విడాకుల కేసుకి సంబంధించి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకి రవి, ఆర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీ కోసం కౌన్సిలింగ్ కు హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది. అయితే రవి మాత్రం.. ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని, విడాకులు మంజూరు చేయాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆర్తి కీలక నిర్ణయం తీసుకుంది. విడాకులు కోరుతున్న తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 12 కి వాయిదా వేసింది.
జయం రవి విడాకులు తీసుకోవాలని బలంగా నిర్ణయించుకోవడంతో.. ఆర్తి ఏకంగా నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరడం సంచలంగా మారింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం ఎలాంటి తీసుకుంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
