English | Telugu
2021 జ్ఞాపకాలుః మెప్పించిన నవతరం దర్శకులు.. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అతనే!
Updated : Dec 11, 2021
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా కొంతమంది కొత్త దర్శకులు తెలుగునాట తొలి అడుగులు వేశారు. అయితే, వీరిలో కొందరు మాత్రమే విజయాలు చూశారు. వారి వివరాల్లోకి వెళితే..
జనవరిలో విడుదలైన ఫాంటసీ రొమాంటిక్ డ్రామా `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` చిత్రంతో మున్నా దర్శకుడిగా పరిచయమయ్యాడు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా.. ``నీలి నీలి ఆకాశం`` పాట తెచ్చిన హైప్ తో ఈ సినిమా విజయతీరాలకు చేరుకోవడంతో మున్నా సక్సెస్ పుల్ డెబ్యూ ఇచ్చినట్లయ్యింది. ఇక ఫిబ్రవరి ప్రథమార్ధంలో విడుదలైన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `ఉప్పెన`తో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కెప్టెన్ గా మొదటి అడుగేశాడు. అనూహ్య విజయంతో వార్తల్లో నిలిచాడు. అలాగే అదే నెలలో రిలీజైన `అల్లరి` నరేశ్ స్టారర్ `నాంది`తో దర్శకుడైన విజయ్ కనకమేడల కూడా ప్రశంసలతో పాటు సక్సెస్ కూడా సొంతం చేసుకున్నాడు.
హరీశ్ శంకర్ కి హ్యాట్రిక్ ఇస్తాడా!
ఇక ఆగస్టులో జనం ముందు నిలిచిన `రాజా రాజా చోర`తో హర్షిత్ గోలి, `ఎస్ ఆర్ కళ్యాణమండపం`తో శ్రీధర్ గదె.. అక్టోబర్ లో ఎంటర్టైన్ చేసిన `పెళ్ళి సందడి`తో గౌరీ రోనంకి, `వరుడు కావలెను`తో లక్ష్మీ సౌజన్య ఓకే అనిపించుకున్నారు. అలాగే ఓటీటీలో విడుదలైన `సినిమా బండి`తో ప్రవీణ్ కండ్రెగుల కూడా పాస్ మార్క్ లు కొట్టేశాడు. వీరితో పాటు మరికొంత మంది నిర్దేశకులు తొలి అడుగులేసినప్పటికీ.. వీరిలా మెప్పించలేకపోయారు. ఓవరాల్ గా.. డెబ్యూ డైరెక్టర్స్ కి 2021 క్యాలెండర్ ఇయర్ మంచి ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి.
చాన్నాళ్ళ తరువాత ఆ పాత్రలో చిరు!
ఇక 2021 `బెస్ట్ డెబ్యూ డైరెక్టర్`గా `ఉప్పెన`తో సంచలనం విజయం అందుకున్న బుచ్చిబాబు సానా పేరునే చెప్పుకోవచ్చు.