తొలి అడుగుల్లోనే అలరించిన కథానాయకులు.. బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణవ్!
on Dec 18, 2021

ప్రతీ ఏడాదిలాగే 2021లోనూ కొంతమంది నూతన కథానాయకులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, వారిలో కొందరిని మాత్రమే విజయం వరించింది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ చూసిన ఆ డెబ్యూ హీరోలు ఎవరంటే..
ప్రదీప్ మాచిరాజుః
బుల్లితెరపై వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసిన ప్రదీప్ మాచిరాజు.. `100% లవ్`, `జులాయి`, `అత్తారింటికి దారేది`, `రామయ్యా వస్తావయ్యా` వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ ఏడాది `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` సినిమాతో కథానాయకుడిగా డెబ్యూ ఇచ్చిన ప్రదీప్.. మొదటి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకున్నాడు.
తేజ సజ్జః
`చూడాలని వుంది`, `ఇంద్ర`, `గంగోత్రి` తదితర బ్లాక్ బస్టర్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్ చేసిన తేజ సజ్జ.. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన `జాంబిరెడ్డి`తో ఫుల్ లెన్త్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే చెప్పుకోదగ్గ విజయం అందుకున్నాడు. ఆపై `ఇష్క్`, ఓటీటీ మూవీ `అద్భుతం`లోనూ సందడి చేశాడు.
వైష్ణవ్ తేజ్ః
మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు అనే ట్యాగ్స్ తో `ఉప్పెన` చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. సంచలన విజయం సాధించిన ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆపై ప్రయోగాత్మక చిత్రం `కొండపొలం`తోనూ నటుడిగా ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా.. `ఉప్పెన`తో 2021 `బెస్ట్ డెబ్యూ హీరో`గా నిలిచాడు.
రోషన్ః
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఈ సంవత్సరమే కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో `నిర్మలా కాన్వెంట్`లో టీనేజ్ హీరోగా కనిపించిన రోషన్.. ఈ ఏడాది `పెళ్ళి సందడి`తో మెయిన్ లీడ్ గా ఎంటర్టైన్ చేశాడు. మిక్స్డ్ టాక్ తో రిలీజైన ఈ సినిమా.. మ్యూజికల్ గా మెప్పించి రోషన్ కి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది.
Also read: బన్నీ - బోయపాటి.. ఓ పిరియడ్ డ్రామా!
వీరితో పాటు మరికొంత మంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమైనా.. అంతగా ముద్ర వేయలేకపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



