English | Telugu
2021 జ్ఞాపకాలుః `జీరో రిలీజ్ ఇయర్` స్టార్స్!
Updated : Dec 17, 2021
కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ కి నోచులేకపోయాయి. దీంతో.. కొందరి స్టార్స్ కి 2021 మరో `జీరో రిలీజ్ ఇయర్`గా నిలిచిపోయింది.
అలా `జీరో రిలీజ్ ఇయర్` స్టార్స్ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ వంటి అగ్ర కథానాయకులు చేరిపోయారు. అయితే, వీరంతా కూడా వచ్చే ఏడాది కొత్త చిత్రాలతో సందడి చేయబోతున్నారు. `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `మెగా 154` చిత్రాలతో చిరంజీవి.. `సర్కారు వారి పాట`, `SSMB 28`తో మహేశ్ బాబు.. `రాధే శ్యామ్`, `ఆది పురుష్`, `సలార్` చిత్రాలతో ప్రభాస్, `ఆర్ ఆర్ ఆర్`, `ఎన్టీఆర్ 30`తో తారక్.. `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య`తో రామ్ చరణ్.. `లైగర్`తో విజయ్ దేవరకొండ 2022లో పలకరించబోతున్నారు.
మరి.. భారీ అంచనాల నడుమ రానున్న ఆయా సినిమాలతో సదరు స్టార్స్ తమ స్థాయికి తగ్గ విజయాలతో ఎంటర్టైన్ చేస్తారేమో చూడాలి.