ఆమె వల్ల పవన్ అభిమానుల్లో పెరిగిన జోష్
on Jul 10, 2013
పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రం "ఖుషి". ఈ చిత్రంలో "గజ్జె గల్లుమన్నాదిరో..." అంటూ మంచి మాస్ మసాలా సాంగ్ లో నటించిన ముంతాజ్ గుర్తుందా?
ఈ అమ్మడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది" చిత్రంలో చిందులేస్తుంది. ఈ పాటకు సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో ముంతాజ్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా "అత్తారింటికి దారేది" చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్టవడం ఖాయమని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మాస్ మసాలా సాంగ్ లో పవన్ తో పాటు సమంత, ప్రణీత, ముంతాజ్, హంస నందినిలు కూడా చిందులేస్తున్నారు. ఈ పాటను గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల కానుంది.