ప్రభాస్ సినిమాలో "ఈగ" విలన్
on Jul 10, 2013
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "ఈగ" చిత్రంలో విలన్ గా తన నటనతో అదరగొట్టిన సుదీప్... మరోసారి రాజమౌళి సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో సుదీప్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కర్నూల్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.