`ఎన్టీఆర్` కు అబిడ్స్ లో ఏం పని???
on Oct 17, 2018
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `ఎన్టీఆర్`. ప్రస్తుతం ఈ బయోపిక్ యమా ఫాస్ట్ గా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఒక్కో పోస్టర్ ఒక్కో విధంగా సినిమాకు హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ప్రజానాయకుడు, కథానాయకుడు రెండు పార్ట్స్ గా సినిమా రాబోతుందని ప్రకటించాక ఈ సినిమా పై ఇంకా భారీ అంచనాలతో పాటు ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆసక్తి అటు సినీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో కూడా మొదలైంది. రోజుకో ఆసక్తికరమైన న్యూస్ తో నిత్యం వార్తల్లో ఉంటోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మరొక వార్త హల్ చల్ చేస్తోంది.
నారా చంద్రబాబు పాత్రలో రానా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆయన భార్య నారా భువనేశ్వరి పాత్ర కొరకు తమిళ నటి మంజిమా మోహన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె గతంలో నాగ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మరి నారా భువనేశ్వరి పాత్రలో ఎలా నటిస్తుందో చూడాలి. త్వరలో ఈమె షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నాయట. దసరా పండుగ తర్వాత అంటే వచ్చే వారంలో అబిడ్స్ లో ని ఎన్టీఆర్ హౌస్ లో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ మాటలు, కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.