రాజా జగన్నాయకుడు పాటలు
on Apr 5, 2014
రాజా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జగన్నాయకుడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగాయి. తొలి సిడీని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. వి.ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణిక, మమతా రావత్, పూవిష కథానాయికలు. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ప్రమోద్ కుమార్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.