రేసుగుర్రం U/A సర్టిఫికేట్
on Apr 5, 2014
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ దక్కించుకుంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. తమన్ సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.