లెజెండ్ కు భయపడిన భయం
on Apr 5, 2014

బాలయ్య నటించిన "లెజెండ్" సినిమా బ్లాక్ బస్తర్ హిట్టయ్యి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షకుల కోసం బాలయ్య సింహ యాత్ర చేస్తున్నారు. గతకొద్ది రోజులుగా "లెజెండ్" చిత్ర యూనిట్ కొంతమంది రాష్ట్రంలోని పలు దేవాలయాలను, సినిమా థియేటర్ లను సందర్శిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలో అభిమానులు భారీ ఎత్తున బాలయ్య కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో మంచి స్పీడ్ మీద ఉన్న కొంతమంది అభిమానుల బైక్ అదుపుతప్పడంతో కొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న కారుని సడెన్ బ్రేక్ తో ఆపడంతో బాలయ్య కుదుపులకు లోనయ్యాడు. కానీ బాలయ్య జాగ్రత్తగా ఉండటంతో పెద్దగా ఎలాంటి గాయాలు కాలేదు. బాలయ్యకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



