రాహుల్ తో కలిసి మళ్లీ చెక్కర్లు కొడుతోంది
on Dec 24, 2021

బిగ్‌బాస్ రియాలిటీ షో పై విమర్శలు వెల్లువెత్తుతున్నా దీని వల్ల చాలా మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ఉన్నట్టుంది అవకాశాలు రావడం.. పబ్లిక్ లో గుర్తింపు లభిస్తోంది. జనానికి పెద్దగా పరిచయం లేని వారు ఆ తరువాత ఈ షో కారణంగా సెలబ్రిటీలుగా మారిపోతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆ తరువాత పాపులర్ అయ్యాడు. అయితే ఇతను మరో విషయంలోనూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. అదే అషురెడ్డి.
Also read:వరుస నెలల్లో తమన్నా సందడి!
బిగ్‌బాస్ సీజన్ కారణంగా పరిచయం అయిన అషురెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఏదో జరుగుతోందని, ఇద్దరు లవ్ లో వున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పబ్బుల్లోనూ వీరు జంటగా కనిపించడం.. ఆ ఫొటోలని అషురెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా వేదికగా షేర్ చేయడంతో ఆ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. గత కొంత కాలంగా పార్టీల్లో కలవకుండా దూరంగా వున్న ఈ జోడీ తాజాగా మళ్లీ కలిసింది.
Also read:ఓటీటీ బాటలోనే నయన్ మరో సినిమా!
గతంలో ఈ ఇద్దరిపై వచ్చిన పుకార్లకు అషురెడ్డి, రాహుల్ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని తేల్చేశారు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఏ పార్టీలోనూ.. ఏ పబ్బులోనూ కనిపించని ఈ జంట తాజాగా ఓ పబ్ లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అషు తాజాగా షేర్ చేయడంతో మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. తాజాగా రాహుల్‌తో తనకున్న రిలేషన్ గురించి వస్తున్న పుకార్లపై మరో సారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అషు. `నాది అనే దానికి నా జీవితంలో ఓ అర్థం వుంది. కానీ ఈ జనం డబుల్ మీనింగ్ తో చూస్తున్నారు` అంటూ క్లారిటీ ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



