Home

»

Latest News

ఓటీటీ బాట‌లోనే న‌య‌న్ మ‌రో సినిమా!

Dec 23, 2021 4:03PM

ఒక‌వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తో జోడీ క‌డుతూనే.. మ‌రోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌. మ‌రీముఖ్యంగా.. గ‌త ఐదారేళ్ళ కాలంలో న‌య‌న్ న‌టించిన ప‌లు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కోలీవుడ్ బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. అయితే, ఇదంతా రెండేళ్ళ క్రితం మాట‌. ఎందుకంటే.. న‌య‌న్ న‌టించిన రీసెంట్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ థియేట్రిక‌ల్ రిలీజెస్ గా కాకుండా.. ఓటీటీలోనే సంద‌డి చేస్తున్నాయి.

గత ఏడాది `మూక్కుత్తి అమ్మ‌న్`(తెలుగులో `అమ్మోరు త‌ల్లి`)తో ఓటీటీలో తొలిసారిగా నేరుగా ప‌ల‌క‌రించిన న‌య‌న‌తార‌.. ఈ సంవ‌త్స‌రం `నేట్రిక్క‌న్`తో ఎంట‌ర్టైన్ చేసింది. ఈ రెండు త‌మిళ్  సినిమాలు కూడా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యాయి. తెలుగులోనూ అనువాద రూపంలో అల‌రించాయి. క‌ట్ చేస్తే.. న‌య‌న్ లేటెస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `ఆక్సిజ‌న్` కూడా ఓటీటీ బాట ప‌ట్ట‌నుంద‌ట‌. నూత‌న ద‌ర్శ‌కుడు జీకే విఘ్నేశ్ రూపొందించిన ఈ నాయికా ప్రాధాన్య చిత్రం కూడా త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంద‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం. మ‌రికొద్ది రోజుల్లో `ఆక్సిజ‌న్` స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న‌ న‌య‌న్.. ఈ సారి ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com