18 ఏళ్ళ క్రితం అనుకున్న కథతో 'రాధే శ్యామ్'.. రిస్క్ చేస్తున్నారా?
on Dec 24, 2021

రెబల్ స్టార్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' ట్రైలర్ వచ్చేసింది. మూవీ టీమ్ ముందు నుండి చెబుతున్నట్లుగానే ట్రైలర్ చూస్తే ఇదొక ఎమోషనల్ లవ్ రైడ్ అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా కథ పద్దెనిమి ఏళ్ళ క్రితం అనుకున్న పాయింట్ అంటూ ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి.
'రాధే శ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడానికి 4 ఇయర్స్ పట్టింది, కానీ రాయడానికి 18 ఇయర్స్ పట్టిందని అన్నాడు. "ఫస్ట్ టైం ఈ పాయింట్ మా గురువు చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర విన్నాను. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రైటర్స్ ని పిలిపించి రాయించాం. కానీ కథకి కంక్లూజన్ దొరకలేదు. కథ ఫినిష్ అవ్వట్లేదు. ఆ టైములో యేలేటి గారు ఒక మాట అన్నారు. ఇది జాతకాల మీద చేస్తున్నాం.. ఈ కథ ఎవరికి రాసి పెట్టుందో అని. ఇది ప్రభాస్ గారికి రాసి పెట్టుంది. ఆయనతో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు..ఒక ఛాలెంజ్ గా తీసుకొని. ఈ పాయింట్ ని మా గురువు దగ్గర అడిగి తీసుకున్నాను. ఒక ఫిలాసఫీని లవ్ స్టోరీలా రాసి ప్రభాస్ కు నేరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో ఫైట్లు, ఛేజ్ లు ఉండవు. అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి. ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్తసముద్రాలు ఈది ముందుకెళ్లే జర్నీ ఉంటుంది." అని రాధా కృష్ణ చెప్పుకొచ్చాడు.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఈ టైంలో లవ్ స్టోరీ చేస్తున్నాడు అంటేనే ఆశ్చర్యం కలిగించింది. అలాంటిది ఇప్పుడు ఆ కథ 18 ఏళ్ళ క్రితం నాటిదని డైరెక్టర్ చెప్పడం ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. అయితే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఏ సినిమా చేసినా పాయింట్ కొత్తగా ఉంటుంది. రాధే శ్యామ్ కథ ఆలోచన ఆయనదే కాబట్టి.. ఈ కథ కూడా కొత్తగా ఉంటుందన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



