Home

»

Latest News

వ‌రుస నెల‌ల్లో త‌మ‌న్నా సంద‌డి!

Dec 23, 2021 3:50PM

ఈ ఏడాది రెండు సినిమాలు, రెండు వెబ్ - సిరీస్ ల్లో క‌నిపించి అల‌రించింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. సెప్టెంబ‌ర్ నెల‌లో వారం గ్యాప్ లో జ‌నం ముందుకొచ్చిన `సీటీమార్`, `మాస్ట్రో` చిత్రాల్లో అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేసిన త‌మ‌న్నా.. అంత‌కంటే ముందే ఆహా ఓటీటీలో `లెవెన్త్ అవ‌ర్`, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో `న‌వంబ‌ర్ స్టోరి` అనే వెబ్ - సిరీస్ ల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అంతేకాదు.. జెమినీ టీవీలో ప్ర‌సార‌మైన‌ `మాస్ట‌ర్ చెఫ్` కార్య‌క్ర‌మం కోసం హోస్ట్  అవ‌తార‌మెత్తింది కూడా. మొత్తంగా.. 2021 త‌మ‌న్నాకి స్పెష‌ల్ ఇయ‌ర్ గా నిలిచింద‌నే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. వ‌చ్చే ఏడాది కూడా త‌మ‌న్నా హ‌వా ఉండబోతోంది. మూడు వ‌రుస నెల‌ల్లో నెల‌కో సినిమాతో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఫిబ్ర‌వ‌రిలో స‌త్య‌దేవ్ కి జోడీగా `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో క‌నిపించ‌నున్న త‌మ‌న్నా.. మార్చిలో వ‌రుణ్ తేజ్ `గ‌ని`లో ఓ ప్ర‌త్యేక గీతం కోసం మెర‌వ‌నుంది. ఇక ఏప్రిల్ నెలాఖ‌రులో సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంకటేశ్ కి జంట‌గా `ఎఫ్ 3`లో వినోదాలు పంచ‌నుంది. మ‌రి.. వ‌రుస నెల‌ల్లో త‌మ‌న్నా చేయ‌నున్న ఈ సంద‌డి ఆమె కెరీర్ కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

మ‌రోవైపు.. `సైరా` త‌రువాత  మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తున్న `భోళా శంక‌ర్` కూడా వ‌చ్చే సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com