Home

»

Latest News

2027 బాక్సాఫీస్ వార్: ఐదు భారీ పాన్ ఇండియా సినిమాలు.. వెయ్యి కోట్ల హీరో ఎవరు.?

Oct 19, 2026 3:14PM

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే 2027 మాత్రం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు తమ భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 18 రిలీజ్ డేట్ గా లాక్ చేశారని టాక్.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి మార్క్ విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించే పవర్‌ఫుల్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ నటన కలిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నారు.

‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘స్పిరిట్’. ప్రభాస్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా విడుదల తేదీని అక్టోబర్ 29, 2027గా ప్రకటించారు.

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 2027 చివర్లో, ముఖ్యంగా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఈ ఐదు సినిమాల్లో ప్రతి ఒక్కటీ భారీ స్థాయి ప్రాజెక్టే. స్టార్ హీరోలు, పేరున్న దర్శకులు, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకున్న కథలు.. ఇలా అన్ని సినిమాలకూ ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.1,000 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఉంది. మరి 2027లో టాలీవుడ్ నుంచి ఏ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది? ఏ హీరో కొత్త రికార్డులు సృష్టిస్తారు? అనేది చూడాలి.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్.. నాని టార్గెట్ ఇదే.!

 

 

 

[Tollywood Pan India Movies 2027, Telugu Movies 2027, Prabhas Fauzi, Mahesh Babu Varanasi, NTR Dragon, Prabhas Spirit, Allu Arjun Raaka, SS Rajamouli, Sandeep Reddy Vanga, Telugu Cinema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com