ప్రభాస్ 'రెబల్'కి పదేళ్లు
on Sep 28, 2022
'డార్లింగ్'(2010), 'మిస్టర్ పర్ఫెక్ట్'(2011) వంటి క్లాస్ హిట్స్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పక్క మాస్ ఫిల్మ్ 'రెబల్'(2012). రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 28, 2012న విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటితో పదేళ్లు పూర్తయింది.
భారీ అంచనాలతో విడుదలైన 'రెబల్' బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. అయినప్పటికీ ఇందులో ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో ట్రెండ్ అయింది. ప్రభాస్ ఆటిట్యూడ్ కి, యాక్షన్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ఫైట్ సీన్, టెంపుల్ ఫైట్ సీన్ హైలైట్ గా నిలిచాయి. పరాజయం పాలైనప్పటికీ ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేక అభిమానం చూపుతుంటారు.
తమన్నా, దీక్ష సేత్, ముకేష్ రిషి, బ్రహ్మానందం, అలీ తదితరులు నటించిన 'రెబల్'లో ప్రభాస్ తండ్రి పాత్రలో కృష్ణంరాజు నటించడం విశేషం. శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. పాటలు లారెన్స్ స్వరపరిచాడు. ఉన్న నాలుగు పాటలకూ మంచి ఆదరణే లభించింది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
