Home

»

Movie Reviews

ntg

సినిమా పేరు : GOAT

బ్యానర్ : మహాతేజ క్రియేషన్స్

Rating : 2.5

విడుదలయిన తేది : Nov 11, 2026

న‌టీన‌టులు: సుధీర్ ఆనంద్, దివ్య భారతి, ప్రియాంక, నితిన్ ప్రసన్న, సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వీ  తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: రసూల్ ఎల్లోర్ 
ఎడిటింగ్: విజయ్  
మ్యూజిక్: జేమ్స్ లియోన్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మణిశర్మ 
నిర్మాత‌: మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సహా నిర్మాత: రవీందర్ రెడ్డి 
బ్యానర్స్: జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహాతేజ క్రియేషన్స్
రచన, దర్శకత్వం: వేదవ్యాస్ 

సుధీర్ ఆనంద్ (సుడిగాలి సుదీర్)  క్రేజీ బ్యూటీ దివ్యభారతి జంటగా తెరకెక్కిన మూవీ G.O.A. T .. ప్రచార చిత్రాలతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ కలిగించి ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
సార్(సుధీర్ ఆనంద్) వైజాగ్ జైలు నుంచి రిలీజైన ఖైది. తన గ్యాంగ్ తో కలిసి ఓసీ( ప్రతి వస్తువుకి డబ్బులు కట్టకుండా) గా బతికేస్తుంటాడు. క్రికెట్ లో బెట్టింగ్ కట్టడాలు, మద్యపానం, ధూమపానం, చిన్న చిన్న సెటిల్ మెంట్స్ లాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. చిన్నసైజు రౌడీ అని చెప్పుకోవచ్చు. సుభాషిణి(దివ్య భారతి) సూసైడ్ ఎలా చేసుకోవాలో తెలియడంలో బాగా అనుభవమున్న స్పెషలిస్ట్. ఒక పదిసార్లైనా సూసైడ్ ప్లాన్ చేసుంటుంది. అలాంటి సుభాషిణి పెళ్లికూతురుగా పెళ్లి పీటలు ఎక్కబోతుంటే సార్ ఆమెని పెళ్లి కాకుండా తీసుకొస్తాడు.

మొద్దు బాబ్జి(నితిన్ ప్రసన్న) ఒక అసాంఘిక శక్తీ. గోదావరి జిల్లాలోని రుద్రవరం అనే ఊరుని స్థావరంగా చేసుకొని అక్కడి ప్రజలని బెట్టింగ్స్ కి బానిసలుగా మారేలా చేసి వాళ్ళ మరణాలకు కూడా కారణమవుతుంటాడు. బాబ్జికి వ్యతిరేకంగా వెంకటకృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) ముప్పై ఏళ్ళ క్రితమే ఒక చట్టం తీసుకొస్తాడు. ఆ చట్టం పేరు G.O.A.T.. గోదావరి అవుట్ డోర్ యాక్టీవిటీస్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఉద్దేశ్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? సార్ అసలు పేరు సారేనా? ఇంకేమైనా ఉందా? ఉంటె సార్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సుభాషిణి ఎవరు? అనేదే  GOAT.  

ఎనాలసిస్ :

కథ చాలా మంచి కాన్సెప్ట్.. ఈ విషయం సినిమా స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా. ఫస్ట్ హాఫ్ కూడా సూపర్ గా ఉంటుంది. దీంతో బొమ్మ హిట్ అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ లో కథనం నీరసించడంతో పాటు దారి తప్పింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక డైరెక్టర్ నేనా అనే డౌట్ కూడా వస్తుంది.

ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కర్ని ఆలోచింపచేస్తాయి. కాకపోతే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ గోల్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. ఎందుకంటే అతని క్యారక్టర్ నే కథకి మూలం కాబట్టి.

సార్(సుధీర్) ట్రాక్    తో పాటు సుభాషిణి ట్రాక్, సుభాషిణి ద్వారానే మెయిన్ కథలోకి వెళ్లడం అయితే సూపర్. పృథ్వీ తో వచ్చిన హాస్పిటల్ సీన్స్ లో వచ్చిన కామెడీ అయితే ఎక్స్ లెంట్. ఈ ట్రాక్ ని కథకి ఇంకా ఉపయోగించుకోవాల్సిందేమో. సాంగ్స్ సైతం బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్  సైతం బాగుంది.

సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఎవరకి ఎవరు ఏం అవుతారో తెలిసింది కాబట్టి, సార్ తన లక్ష్య సాధనకి త్వరగా వెళ్లేలా చెయ్యాల్సింది. అలా కాకుండా సుభాషిణి, సార్ మధ్య మళ్ళీ ఎక్కువ ట్రాక్ నడించింది. కాకపోతే ఆ సీన్స్ బాగానే ఉన్నా, మెయిన్ కథలోకి ఎందుకు వెళ్లరని అనిపిస్తూ ఉంటుంది.

బాబ్జి( నితిన్ ప్రసన్న) యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ క్యారక్టర్ కి అంతగా సెట్ అవ్వలేదు. సర్వదమన్ బెనర్జీ ట్రాక్ బాగుంది. చివరి అరగంట పస లేని సీన్స్ వచ్చాయి. అసలు బాగా చదువుకోవడంతో పాటు ఎంతో తెలివిగల సుభాషిణి హీరో(సార్) కోసం తనకి ఇష్టం లేని ఒక రౌడీ దగ్గరకి వచ్చి హీరోని ఏం చేయవద్దు నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుందా! ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
సార్ గా సుధీర్ ప్రసాద్ సెటిల్డ్ పెర్ఫార్మ్ చేసాడు. క్రికెటర్ గణగా చేసినా అది సుధీరో కాదో తెలియదు. సుభాషిణిగా దివ్యభారతి పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా మొత్తానికే తన క్యారక్టర్ హైలెట్. అందుకు తగ్గట్టే తన అందంతో స్క్రీన్ కి కూడా అందం తీసుకొచ్చింది. సర్వదమన్ బెనర్జీ, సుధీర్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.  బాబ్జిగా నితిన్ ప్రసన్న సెట్ కాలేదు. పెర్ఫార్మ్ మాత్రం బాగుంది. బ్రహ్మాజి స్క్రీన్ షేరింగ్  తక్కువే అయినా మరోసారి అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,  జేమ్స్ లియోన్ మ్యూజిక్ గోట్ కి అదనపు హంగులని ఇచ్చాయి. సీనియర్ కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ మరో సారి తన ఫొటోగ్రఫీ తో  ప్రతి ఫేమ్ ని అత్యంత సుందరంగా మలిచాడు. వేదవ్యాస్ దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా ఇంకా తన ప్రతిభని చాటాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్ లో ఉన్నాయి.

బలాలు
+ కథ
+ సుధీర్, దివ్య భారతి పెర్ఫార్మెన్స్
+ ఫస్ట్ హాఫ్ 

బలహీనతలు   
- సెకండ్ హాఫ్ లో చివరి అరగంట నడిచిన కథనం

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ :

మంచి కథతో పాటు మంచి సందేశంతో తెరకెక్కింది.

- అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com