Home

»

Latest News

Itlu Arjuna Movie Review Telugu: ఇట్లు అర్జున మూవీ రివ్యూ 

Nov 13, 2026 9:01AM

 

-సినిమా పేరు: ఇట్లు అర్జున
-న‌టీన‌టులు: అనీష్, అనస్వర రాజన్, ముఖేష్ రిషి, కలైయరసన్, ఇలంగో కుమరవేల్, బ్రహ్మాజీ, -వెన్నెల కిషోర్ తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: రాజా మహాదేవన్
-ఎడిటింగ్: కోటి కె 
-మ్యూజిక్: థమన్ 
-నిర్మాత‌: వెంకీ కుడుముల
-బ్యానర్: వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
-సమర్పణ: కింగ్ నాగార్జున 
-రచన,దర్శకత్వం: మహేష్ ఉప్పల
-రిలీజ్ డేట్ : నవంబర్ 13 ,2026 

 

కింగ్ నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న నయా మూవీ ఇట్లు అర్జున..డెబ్యూ హీరో అనీష్, అనశ్వర రాజన్ హీరో, హీరోయిన్. ఈ రోజు సెల్యులాయిడ్ పై సైన్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  


కథ
పెద్దన్న(ముకేశ్ రుషి) నేర ప్రవృతి గల సామ్రాజ్యనికి అధిపతి. ఆడ, మగ నేర స్వభావం గల వాళ్ళందర్నీ కుటంబవ్యవస్గగా మార్చుకొని తన ఆధీనంలోనే( గేటెడ్ కమ్యూనిటీ) గా  ఉంచుకుంటాడు.1000 కోట్ల హవాలా డబ్బుతో కొడుకు కోసం సొంత రాజకీయ పార్టీ పెట్టాలనే లక్ష్యంతో ఉంటాడు. అర్జున( అనీష్) దొంగతనాలు చేసుకుని బతికే కుటుంబానికి చెందిన వ్యక్తి..అలా అని అసాంఘిక శక్తి కాదు. మంచి వ్యక్తే.. మాటలు రావు. చిన్నప్పటి నుంచే తన అపార్ట్మెంట్ లోనే ఉండే కీర్తి(అనశ్వర రాజన్) ని ఇష్టపడుతుంటాడు. కీర్తి ఒక క్రిస్టియన్.చాలా మంచి అమ్మాయి. 
నైట్ పార్టీలకి వెళ్తూ సరదాగా బతకాలని ఉన్నా కూడా, ఆడపిల్ల చాలా హుందాగా  బాధ్యతగా, పద్దతిగా ఉండాలని తల్లి అంటుంటుంది. ఈ మూడు పార్శ్యాల మధ్య ఏం జరిగిందనేదే ఇట్లు అర్జున. 


ఎనాలసిస్ 
 మూవీ మొత్తం చాలా రిచ్ గా ఉంది. కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగినా, మెయిన్ పాయింట్ విషయంలో కొంచం కన్ఫ్యూజ్.అలా కాకుండా అర్జునకి సంబంధం లేకుండానే 1000 కోట్ల హవాలా డబ్బులో తన ప్రేయసి కీర్తితో కలిసి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే ఎస్టాబ్లిష్ తోనే మూవీని ఎండ్ చెయ్యాలసింది. ఎందుకంటే కీర్తిని తీసుకొని 1000 కోట్ల హవాలా డబ్బు కాజేసిన వ్యక్తి ఇంటికి అర్జున్ వెళ్ళడు కదా!. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మొదటి పావుగంట వచ్చిన సన్నివేశాలతో కొత్త రకం స్క్రీన్ ప్లే తో మూవీ చూస్తున్నామని విషయం అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలు వచ్చి మెస్మరైజ్ చేసాయి.

తెలుగు తెరపై చాలా రోజుల తర్వాత మెరిసిన ఫార్మేట్ అని కూడా అనుకోవచ్చు. కీర్తి, అర్జున మధ్య వచ్చిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. అందుకు తగ్గట్టే సాంగ్స్ సైతం ఉన్నాయి. పెద్దన్న ఎపిసోడ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా మరింతగా ఉండాల్సింది. ఉన్నంతలో మెస్మరైజ్ చేసాయి. బ్రహ్మ( నెగిటివ్ క్యారక్టర్) బ్రహ్మాజీ సీన్స్ సైతం కథకి హెల్ప్ అయ్యాయి.  1000 కోట్ల హవాలా డబ్బులో కీర్తి, అర్జున ఇరుక్కునే ప్రాసెస్ మొత్తం కూడా సూపర్. ఇంటర్వెల్ బ్లాంగ్ పేలింది. సెకండ్ హాఫ్ లో చూసుకునే కథనం మొత్తం చాలా ఫాస్ట్ గా, క్యూరియాసిటీగా సాగింది.

పోలీస్ క్యారక్టర్ ఎపిసోడ్ తో పాటు అర్జున, కీర్తి మధ్య మదించిన టోటల్ ఎపిసోడ్ బాగుంది. పైన ఫస్ట్ లోనే చెప్పుకున్నట్టు హవాలా డబ్బు విషయంలో అర్జునకి ఏం తెలియదనే ఎస్టాబ్లిష్ చేసి, కీర్తిని కూడా పెద్దన్న దగ్గరే బందీగా ఉంచాల్సిందేమో. ఏది ఏమైనా చివర్లో కొన్ని సీన్స్ సిల్లీగా తేలిపోయాయి. ఉదాహరణకి అర్జున శరీరంలో బుల్లెట్స్ దిగినా మాములుగా చూపించడం. అదే విధంగా క్లైమాక్స్ లో   కీర్తికి తన ప్రేమని వ్యక్తపరిచే ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్, భూమిక ల ఖుషి ట్రైన్ ఎపిసోడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. దాంతో క్యూరియాసిటీ పెరిగేది. ఈ సబ్జెట్ కి అది అవసరం కూడా.


నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు

మొదటి సినిమా అయినా అనీష్ అన్ని రకాల వేరియేషన్స్ లో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. డాన్స్, ఫైట్స్, ఎంటర్టైన్ మెంట్ తాలూకు బాడీ లాంగ్వేజ్ ని, భావజాలాన్ని ప్రదర్శించడంలో భారీగానే సక్సెస్ అయ్యాడు. తెలుగు తెరకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. అనస్వర రాజన్ మరో సారి తన క్యూట్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆమె పెర్ఫార్మ్ నిండు పున్నమి వెన్నెలని తలపించింది.ముకేశ్ రుషి, బ్రహ్మాజీ తో పాటు మిగతా అన్ని క్యారెక్టర్స్ లలో చేసిన వాళ్ళందరూ తమ నటనతో కథకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బ్రహ్మ గా చేసిన విలన్ క్యారక్టర్ అయితే తెలుగులో బిజీ అవ్వడం ఖాయం. వెన్నెల కిషోర్ మరో సారి నవ్వుల్లో ముంచెత్తాడు. ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. థమన్ ఆర్ ఆర్, సాంగ్స్ కూడా అదే పరిస్థితి. తనదైన మ్యూజిక్ మాయాజాలంతో ఇట్లు అర్జున్ కి అదనపు వన్నె తీసుకొచ్చాడు. వెంకీ కుడుమల నిర్మాణ విలువలు చాలా హుందాగా, రిచ్ గా ఉన్నాయి, మహేష్ దర్సకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడు. తనదైన టేకింగ్ తో ప్రతి సన్నివేశాన్ని పరుగెత్తించాడు. రచయితగా కొన్ని లాజిక్స్ మర్చిపోయాడు.


బలాలు
1 . అనీష్, అనశ్వర రాజన్ తో ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్
2 .డైరెక్షన్ 
3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
4 . ఫొటోగ్రఫీ 

బలహీనతలు

1.లాజిక్ లేని కొన్ని సీన్స్ 

ఇట్లు అర్జున కథనంలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.  

రేటింగ్ 2 .5 /5                                                                         అరుణాచలం

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com