
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే హడావుడి వేరే లెవల్. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. బిజినెస్ విషయంలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా థియేట్రికల్ హక్కుల గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల మధ్య పోటీ నెలకొనగా.. చివరకు ఏషియన్ సినిమాస్ ఈ డీల్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.
తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం.. చిరంజీవి ‘కాకా’ నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సినిమాస్ సుమారు రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఈ డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కూడా పోటీ పడినట్లు సమాచారం. అయితే చివరకు ఏషియన్ సినిమాస్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక కేవలం నైజాం మాత్రమే కాకుండా ఆంధ్రా, సీడెడ్, కర్ణాటక హక్కులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కలిపి దాదాపు రూ.130 కోట్ల రేంజ్ లో జరుగుతోందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్ వీడియో.. యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే.!
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాసు అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురిగా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.
తండ్రీకూతుళ్ల అనుబంధం, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాకు సంక్రాంతి విడుదల మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. 2027 జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
మీకు నచ్చవచ్చు:
50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన తెలుగు సినిమా.!
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!
[Kaaka Nizam Rights, 35 Crore Deal, Chiranjeevi, Bobby Kolli, Asian Cinemas]





