Home

»

Latest News

నిర్మాతగా మారుతున్న బాలయ్య కుమార్తె.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా.?

Nov 13, 2026 11:01AM

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నటులుగానే కాకుండా నిర్మాతలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా చేరబోతున్నారు. ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందనున్న సినిమాతో ఆమె నిర్మాతగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటివరకు నిర్మాతగా సినిమాలు చేసిన భువన్.. ఈ చిత్రంతో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. నిఖిల్ హీరోగా ఆయన నిర్మించిన 'స్వయంభు' సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు భువన్ మెగాఫోన్ పట్టుకుని ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో యువ నటుడు అన్వేష్ హీరోగా నటించబోతున్నారు. సీనియర్ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి తనయుడే ఈ అన్వేష్. 'వినవయ్యా రామయ్యా', 'ఏంజెల్' వంటి సినిమాల్లో హీరోగా నటించారు. 

నవంబర్ 23 నుంచి విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: బాలయ్య నన్ను ‘ఏరా పెద్దిరెడ్డి’ అని పిలుస్తారు.. ‘దాదా’ సినిమా ఎలా ఉండబోతుందంటే.?

తేజస్విని ఇప్పటికే తండ్రి బాలకృష్ణ సినిమాల నిర్మాణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య హోస్ట్‌గా చేసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో సక్సెస్ వెనుక కూడా ఆమె క్రియేటివ్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. అలాగే 'అఖండ 2' వంటి సినిమాల నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆమె భాగస్వామిగా ఉన్నారు.

అయితే ఇప్పటివరకు తండ్రి సినిమాల వెనుక ఉండి బాధ్యతలు నిర్వహించిన తేజస్విని.. ఇప్పుడు యువ నటుడితో ఓ కొత్త కాన్సెప్ట్ మూవీని నిర్మించేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుంది? పూర్తిస్థాయి నిర్మాతగా తేజస్విని తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అన్నది చూడాలి.

మీకు నచ్చవచ్చు:
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే షాక్.!

 

 

 

[Nandamuri Tejaswini, Balakrishna Daughter, Tejaswini Producer Debut, Anvesh, Bhuvan Director]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com