Home

»

Latest News

రామాయణపై మహేష్ కొడుకు గౌతమ్ ఇచ్చిన రివ్యూ ఇదే!

Nov 12, 2026 4:27PM


వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ తన దూకుడుని ప్రదరిస్తున్న విషయం తెలిసిందే. అభిమానులైతే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే భారతీయ సినిమాగా నిలవాలని ఆ రాముడ్నే ప్రార్థిస్తున్నారు. ఇక  సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సినిమాలపై ఇచ్చే రివ్యూలు హాట్ టాపిక్‌గా మారుతుండే విషయం తెలిసిందే. 

ఈ కోవలోనే  తాజాగా రామాయణని  గౌతమ్ ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లెటర్‌బాక్స్డ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఈ దృశ్య కావ్యంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు.

సినిమా చూశాక తన మనసు పూర్తిగా కరిగిపోయిందని, మాటలు రావడం లేదని, సీజీఐ, స్క్రిప్ట్, డైరెక్షన్, నటీనటుల అభినయం అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన హిందీ పాటలు: ఇప్పుడు ఎందుకు వినిపించడం లేదు? అసలు కారణాలివే!

రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరచగా, రావణాసురుడిగా  రాకింగ్ స్టార్ యష్ నటన మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకుందని, ఆయన అభినయం అసాధారణంగా, నెక్స్ట్ లెవెల్‌లో ఉందని, సినిమా అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్లు అనిపించినప్పటికీ, ఆ నిడివి పెద్ద మైనస్‌గా మారలేదని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ఆయన స్పష్టం చేశారు.

 

భారతీయ సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పే ఒక నిజమైన నిదర్శనం ఈ చిత్రమని గౌతమ్ అభివర్ణించారు.

 

మీకు నచ్చవచ్చు: కరీనా కపూర్ vs ఖురాన్ వచనాలు
మీకు నచ్చవచ్చు: Goat Movie Review Telugu: Goat మూవీ రివ్యూ 

 


[Gautham Ghattamaneni, Ramayana, Ranbir Kapoor, Yash, Nitesh Tiwari, sai pallavi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com