Home

»

Gossips

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్: ఆ సినిమా రిలీజ్ కాకముందే బంపరాఫర్.!

Oct 10, 2026 10:19AM

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్‌తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. అలాంటి యష్‌తో ఓ తెలుగు కొత్త దర్శకుడు సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. మంచు మనోజ్‌తో ‘డేవిడ్ రెడ్డి’ తెరకెక్కిస్తున్న హనుమ రెడ్డి యక్కంటి.

ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా విడుదల కాని ఈ దర్శకుడికి.. ఏకంగా యష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందనే ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

హనుమ రెడ్డి ప్రస్తుతం మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో మనోజ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సముద్రఖని, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో భాగమయ్యారు. ఇక ‘కేజీఎఫ్’ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి పనిచేస్తుండటం మరో ఆసక్తికరమైన విషయం.

ఒక కొత్త దర్శకుడు తన తొలి సినిమాకే ఇలాంటి భారీ టీమ్‌ను సెట్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ముందే యష్‌తో తదుపరి ప్రాజెక్ట్ అంటూ వార్తలు రావడంతో హనుమ రెడ్డి పేరు మరింతగా చర్చల్లోకి వచ్చింది.

త్వరలో ‘రామాయణ’లో రావణుడి పాత్రతో పాటు అలరించనున్న యష్.. ‘టాక్సిక్’ రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఎలాంటి డైరెక్టర్ కి ఓకే చెబుతారా అనే ఆసక్తి నెలకొంది. అలాంటిది ఊహించనివిధంగా హనుమ రెడ్డి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. 

‘డేవిడ్ రెడ్డి’ విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తే హనుమ రెడ్డికి దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో యష్‌తో సినిమా చేసే వార్త కూడా నిజమైతే, ఆయన కెరీర్‌కు అది పెద్ద మలుపు అవుతుంది. 

ఇది కూడా చదవండి: జైలర్ 2 టికెట్ రేట్లు పెంపు.. ఏపీలో కొత్త ధరలు ఇవే.!

 

 

 

[Yash Next Movie With Tollywood Director, Yash Hanuma Reddy Movie, Rocking Star Yash, David Reddy Movie, Hanuma Reddy Yakkanti, Manchu Manoj, Yash Next Movie, KGF Star Yash, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com