హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్న ఓ స్టార్ హీరో!
on Dec 18, 2014
సినీ ప్రపంచంలో కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా భార్యల్ని మార్చేస్తుంటారు. మనిషీ, మానవత్వం, మానవ సంబంధాలూ, నీతి, నిజాయతీ ఇలాంటివి స్పీచులు ఇవ్వడానికీ, సినిమాల్లో క్లాసులు పీకడానికీ మాత్రమే. నిజ జీవితంలో అంతా డొల్లే. సినీ ప్రపంచానికీ, తన అభిమానులకూ దైవం.. కానీ వ్యక్తిగత జీవితంలో విలువలు మాత్రం శూన్యం. అలాంటి హీరో కథ ఇది. ఇప్పటికే పెళ్లి మీద తనకు సరైన అభిప్రాయం లేదని నిరూపించుకొన్న ఓ హీరో... భార్య ఉండగానే మరో కథానాయికతో సహజీవనం మొదలెట్టాడని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుత భార్యకీ విడాకులు ఇచ్చేసి, ఎప్పట్లా భరణం రూపంలో కోట్లకు కోట్లు చెల్లించేసి మరొకరిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని చెప్పుకొంటున్నారు. హీరోయిన్ అంటే స్టార్ హీరోయిన్కూడా కాదు. ఒకట్రెండు సినిమాల్లో చేసింది. అవీ చిన్నవే. కానీ టాప్ హీరో దృష్టిలో పడింది. ఇద్దరూ ఇప్పుడు సహజీవనం చేస్తున్నార్ట. హీరోగారికి సపర్యలు చేసే పనిలో పడిందీ అమ్మాయిగారు. ఈ ఇద్దరి వ్యవహారం మెల్ల మెల్లగా బయటకు పొక్కుతోంది. పూర్తిగా తెలియకముందే.. అన్ని విధాలా సర్దుబాటు చేసుకోవాలని ఆ హీరోగారు ప్రయత్నిస్తున్నార్ట. ఎప్పుడో ఒకప్పుడు సడన్ గా ప్రస్తుత భార్యకు విడాకులు ఇచ్చేసినట్టు, మరోకామెను పెళ్లిచేసుకొన్నట్టు ఓ న్యూస్ బులెటెన్ మీడియాకు రిలీజ్ చేసినా చేయొచ్చు. మరి ఈసారి అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో..??