
బాలీవుడ్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా ‘ది డర్టీ పిక్చర్’. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా బాలన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చ మొదలైంది. తాజాగా ఈ రేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది.
‘ది డర్టీ పిక్చర్ 2’లో తమన్నా ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తృప్తి డిమ్రి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
తమన్నా ఇటీవల ప్రత్యేక గీతాలు, గ్లామరస్ పాత్రలతో హిందీ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమె ఈ సినిమాలో నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

2011లో విడుదలైన ‘ది డర్టీ పిక్చర్’ సిల్క్ స్మిత జీవితం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కింది. ఈ సినిమాలో విద్యా బాలన్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది.
ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‌లో మాత్రం సిల్క్ స్మిత కథను మరోసారి చూపించబోవడం లేదని సమాచారం.1980లలో దక్షిణాది సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నిషా నూర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: మైత్రి ఇన్ లవ్.. శ్రీకాంత్ కుమార్తె సినిమాతో రామజోగయ్య శాస్త్రి తనయుడి ఎంట్రీ.!
[Tamannaah Bhatia in The Dirty Picture 2, Silk Smitha, Dirty Picture Sequel, The Dirty Picture 2, Tamannaah Bhatia, Triptii Dimri, Ekta Kapoor, Vidya Balan, Telugu News




