పవన్ మరదలికి ఘోర అవమానం
on May 8, 2014
.jpeg)
ఒక సినిమా హిట్టయితే ఆ సినిమా హీరోయిన్ టాలీవుడ్ లో ఎంత పాపులర్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటివలే "అత్తారింటికి దారేది" చిత్రంతో వరుస తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుని బిజీగా ఉన్న హీరోయిన్ ప్రణీతకు హైదరాబాద్ లోని పాతబస్తీలో అనుకోని విధంగా చేదు అనుభవం ఎదురయ్యింది.
ఇటీవలే పాతబస్తీలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళిన ఆమె కోసం అక్కడ జనాలు ఎవరు అంతగా రాలేరట. వచ్చిన కొంతమంది జనాలు కూడా తనని గుర్తుపట్టకపోవడంతో కోపం ఒకవైపైతే... అక్కడి నిర్వాహకులు తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేరనే ఆగ్రహం మరోవైపు పెరిగిపోయింది. దాంతో ఏదో త్వరత్వరగా కార్యక్రమం ముగించుకొని అక్కడి నుండి ప్రణీత వెళ్ళిపోయిందని తెలిసింది. ఇంకోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణీత నిర్ణయించుకుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



