Home

»

Gossips

గ్రేట్ ఎస్కేప్: 'రణబాలి'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా.?

Oct 16, 2026 7:36PM

ఒక కథను ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. అదే కథతో మరో హీరో సినిమా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మొదట ఈ కథను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మొదట ‘రణబాలి’ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాలని అనుకున్నారట. అయితే ఈ తరహా పీరియాడిక్ డ్రామాలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిందని భావించిన రామ్ చరణ్.. ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని ప్రచారం జరుగుతోంది.

‘రణబాలి’ కథను రామ్ చరణ్ రిజెక్ట్ చేశారనే వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఒకవేళ ఆయన ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఈ సినిమా ఆయన కెరీర్‌కు మరో ఫ్లాప్‌గా మిగిలేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం రామ్ చరణ్ లుక్, నటనకు ఈ పాత్ర బాగా సరిపోయేదని అంటున్నారు.

1876–78 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన మహా కరువు నేపథ్యంతో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథగా ఈ సినిమాను రూపొందించారు. 

తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో రామ్ చరణ్ ఈ కథ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అనేది అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చగా మారింది.

ఇది కూడా చదవండి: చిరంజీవితో మల్టీస్టారర్.. ఎప్పుడు ఉంటుందో చెప్పిన నాగార్జున.!

 

 

 

[Did Ram Charan Reject Ranabaali, Ram Charan Rejected Ranabaali, Ranabaali Movie, Ram Charan, Vijay Deverakonda, Rahul Sankrityan, Rashmika Mandanna, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com