బాలయ్య 'లయన్’ కాదు 'వారియర్'
on Dec 19, 2014
నందమూరి నట సింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు సినిమా షూటింగ్ జరపుకుంటూనే, జనవరి 1 కానుకగా అభిమానుల కోసం ట్రైలర్ విడుదల చేసే పనిలో మూవీ యూనిట్ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ పై నెలకొన్న గందరగోళం ముగిసినట్లు సమాచారం. బాలయ్య సెంటిమెంట్ టైటిల్ ఈ సినిమాకు పెట్టాలని అనుకున్న ‘లయన్’ అనే పేరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించడంతో, ఇప్పుడు ఈ సినిమాకు 'వారియర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదల అయిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. సమాజంలో మార్పు కోసం ఓ సామాన్యుడు చేసిన కృషి ఈ సినిమాలో చూపిస్తారని మూవీ యూనిట్ తెలిపింది.