TeluguOne App Promotion
● # Tweets

Home

»

బాలీవుడ్

తెల్లవారుజామున భజన.. అక్షయ్ కుమార్‌ పరువు తీసేసిన ట్వింకిల్ ఖన్నా.!

Nov 26, 2026 11:42AM

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఇంట్లోనే ఊహించని షాక్ తగిలింది. అది కూడా మరెవరి నుంచో కాదు.. ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా నుంచే. తాజాగా ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’లో అక్షయ్ కుమార్ చేసిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాల్‌లో ట్వింకిల్ వేసిన పంచ్‌లు చూస్తే అక్షయ్‌తో పాటు కరణ్ జోహార్ కూడా నవ్వుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్‌తో పాటు నటుడు రవి కిషన్ కూడా పాల్గొన్నారు. షోలో భాగంగా ఓ సెలబ్రిటీకి ఫోన్ చేసి కరణ్‌కు సంబంధించిన ఓ డైలాగ్ చెప్పించాలనే ఛాలెంజ్ ఇచ్చారు. అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు కాల్ చేశాడు. ఫోన్ స్పీకర్‌లో ఉందని, అక్కడ జరుగుతున్న సంభాషణ రికార్డ్ అవుతోందని ఆమెకు తెలియదు.

ఫోన్ ఎత్తగానే ట్వింకిల్ తన భర్తపై ఫిర్యాదుల వర్షం కురిపించింది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదని, తెల్లవారుజామున 6 గంటలకే అక్షయ్ భజనలు పెట్టి తన నిద్ర చెడగొట్టాడని చెప్పింది. అంతటితో ఆగకుండా.. భజనలు పెట్టడమే కాకుండా, అక్షయ్ ఇంకా గట్టిగా పాడుతున్నాడని సెటైర్ వేసింది. అనూప్ జలోటాలా పాడుతున్నావా అంటూ ఆటపట్టించింది. కనీసం బాత్రూమ్ డోర్ అయినా సరిగ్గా మూసుకోవాలని మరో చురక అంటించింది.

ఆ తర్వాత అక్షయ్ ను ఎక్కడున్నావని అడిగిన ట్వింకిల్.. తను ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఉన్నాడని తెలుసుకుంది. కరణ్ జోహార్‌తో తాను ముందు రోజే మాట్లాడానని, ఈ ఎపిసోడ్‌లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌కు జడ్జిగా రావాలని ఆయన అడిగారని చెప్పింది. అయితే అక్షయ్ అదే రోజు షోలో పాల్గొంటున్నాడని తనకు తెలియదని అంది.

ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.!

ఇక్కడే అసలు పంచ్ పేలింది. అక్షయ్ ఈ షోకు ఉచితంగా వచ్చాడని తెలుసుకున్న ట్వింకిల్.. “నువ్వు ఫ్రీగా చేస్తున్నావా? నాకు ఆశ్చర్యంగా ఉంది” అన్నట్టుగా ఆటపట్టించింది. వెంటనే కరణ్ కూడా సంభాషణలోకి వచ్చి.. ప్రతిదానికీ డబ్బులు కావాలా అంటూ ట్వింకిల్‌ను సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఆమె మాట్లాడుతున్నది కరణ్ కూడా వింటున్నాడని గ్రహించి మరింత ఫన్నీగా స్పందించింది.

ఇదే ఎపిసోడ్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా జరిగింది. అక్షయ్‌తో కలిసి వచ్చిన రవి కిషన్ తన వైరల్ హుక్ స్టెప్‌ను చేసి చూపించారు. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఏడాది పాటు శారీరక వ్యాయామం చేయకుండా ఉండటమా, లేక ఏడాది పాటు శృంగారానికి దూరంగా ఉండటమా అనే ప్రశ్నకు అక్షయ్ తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు. ‘శృంగారం కూడా మంచి వ్యాయామమే కదా!’ అంటూ నవ్వించాడు.

మొత్తానికి అక్షయ్ కుమార్ షోలో భార్యకు ఫోన్ చేస్తే.. ట్వింకిల్ మాత్రం ఆయన ఉదయం భజనల దగ్గర నుంచి ఉచితంగా షోకు వెళ్లడం వరకు అన్నింటిపైనా పంచ్‌లు వేసింది. ఈ జంట మధ్య ఉండే సరదా సంభాషణ మరోసారి ప్రేక్షకులను నవ్విస్తోంది. అందుకే ట్వింకిల్ ఫోన్ కాల్ ఇప్పుడు ఎపిసోడ్‌లో హైలైట్‌గా మారింది.

మీకు నచ్చవచ్చు: 
బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
వృషకర్మ ట్రైలర్‌.. అసలు ఊహించలేదు.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.!

 

 

 

[Koffee With Karan, Twinkle Khanna, Akshay Kumar, Ravi Kishan, Karan Johar]

 

google-ad-img