Home

»

Bollywood News

Shah Rukh khan: నెట్టింట్లో షారుక్ ఖాన్ రొమాంటిక్ వీడియో వైరల్ 

May 07, 2026

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh khan)'డంకీ'తో కొంచం స్లో అయ్యాడు. కానీ ఇప్పుడు ‘కింగ్’(King)తో ఆ స్లో కి పెద్దగా వాల్యూ లేదని చెప్పడానికి సిద్దమవుతున్నాడు. అయితే  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలు లీక్ అవ్వడం మేకర్స్, ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.


కింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ని కేప్ టౌన్ తీరంలో షూటింగ్ చేస్తుంది. షారుఖ్, హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone)మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని షాట్స్ లీక్ అయ్యాయి. కేవలం ఈ సాంగ్ నే కాకుండా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షాట్స్ కూడా లీక్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం షాక్ కి గురయ్యింది. సదరు షాట్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉన్నారని అభిమానులు మండిపడుతున్నారు.


Also read: jyothika: న్యాయం దేవుడి లాంటిది, వెతికి పట్టుకోవడం కష్టం.. అంతా అధికారం గురించే  


 ఈ యాక్షన్ థ్రిల్లర్ లో షారుఖ్ ఖాన్ డాన్  క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఆయన శిష్యురాలిగా లేదా కుమార్తెగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.  షారుఖ్, దీపికా పదుకొణె  'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'పఠాన్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది.  సుజోయ్ ఘోష్ దర్శకుడు కాగా ఈ సంవత్సరం డిసెంబర్ 24 న థియేటర్స్ లోకి రానుంది.

 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com