బయటపడ్డ మాధురి దీక్షిత్ అసలైన ఏజ్: 25 ఇయర్స్ నే అంట..ఆ బ్యూటీ సీక్రెట్ ఇదే!
Nov 25, 2026 2:51PM

'దేఖా హై పహలీ బార్ సాజన్ కి ఆఖో మే ప్యార్' అంటూ టోటల్ ఇండియాని షేక్ చేసిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. షేక్ చెయ్యడమే కాదు తన అద్భుతమైన నటనతో, అందంతో, డాన్స్ తో, నవ్వుతో ఎంతో మంది అభిమానులకి కలల రాణిగా మిగిలిపోయింది. ఆ అపురూప సౌందర్యం 1967 మే 15 న ఈ భూమ్మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె వయసు ఇంకా పాతికేళ్ళు కూడా నిండలేదు. ఏంటి షాక్ అవుతున్నారా? పై ఫోటోని క్లియర్ గా చూస్తే పాతికేళ్ళు కూడా ఉండవనుకుంటా అంటారు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాధురి తన స్కిన్ కేర్ సీక్రెట్స్ బయటపెట్టింది. మాధురీ స్కిన్ కేర్‌లో ప్రధానంగా మూడు విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు.
మాయిశ్చరైజర్: చర్మం తేమగా, మృదువుగా ఉండేందుకు మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం ముఖ్యం.
SPF సన్‌స్క్రీన్: సూర్యుడి UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడేందుకు పగటిపూట సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి.
రెటినాయిడ్స్: చర్మ కణాల పునరుద్ధరణకి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఇవి సహాయపడతాయి. అయితే చర్మ నిపుణుల సలహాతోనే వాడాలి.

ఖరీదైన క్రీములు అవసరం లేదు:చర్మ సంరక్షణ కోసం రకరకాల ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదని మాధురీ సూచిస్తున్నారు. మన చర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని సరైన ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఉపయోగించడమే ముఖ్యమని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి గరివిడి లక్ష్మి: ఐదు భాషల్లో సందడి.. డేట్ తెలిస్తే ఈ రోజే పనులన్నీ ఫినిష్ చేస్తారు!
మొత్తానికి మాధురీ దీక్షిత్ చెప్పిన ఈ సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. అందంగా కనిపించాలంటే ఖరీదైన ఉత్పత్తుల కంటే సరైన అలవాట్లే ముఖ్యమన్నది ఆమె మాటల్లోని అసలు సీక్రెట్!

మరి మీ మమ్మీస్, ఆంటీస్ మీకు పోటీ వస్తారని అసూయపడకుండా మాధురి సీక్రెట్స్ చెప్పేసేయండి. వాళ్ళు తక్కువగా కనిపిస్తే మీ ఏజ్ కూడా తక్కువగా కనిపిస్తారనే విషయం మరువకు సుమీ.
మీకు నచ్చవచ్చు
ఎన్టీఆర్ పై జెనీలియా వ్యాఖ్యలు వైరల్!
[Madhuri Dixit, Beauty Secrets, SPF Sunscreen, Moisturizer, Retinoids, Bollywood]


