Home

»

Bollywood News

shah rukh khan: బాలీవుడ్ లో కలకలం... షారుక్ ని అవమానించిన అగ్ర దర్శకుడు!

May 29, 2026 12:59PM

 

 

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ కి ఉన్న చరిష్మా తెలిసిందే. ప్రస్తుతం కింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో తన గత చిత్రాల రికార్డులన్నిటిని చెరిపివేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అభిమానులు కూడా సదరు చిత్రం యొక్క అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాని అసలు వదలడం లేదు. ఈ క్రమంలో షారుక్ కి అన్ ఫాలో చేసిన అగ్ర దర్శకుడి న్యూస్ కంటపడటంతో షాక్ కి గురయ్యారు. 


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్‌, కరీనా కపూర్ ఖాన్, కాజోల్, మలైకా అరోరా, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్యా పాండేని అన్‌ఫాలో చేశాడు. మే 25న తన 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో, చిత్ర పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.సాంకేతిక లోపం అయ్యి ఉంటుందని కొందరు భావించగా, స్నేహాల మధ్య చిచ్చు రేగిందని మరికొందరు ప్రచారం చేశారు.. అయితే, ఈ  గ ప్రియాంకా చోప్రాని మాత్రం అన్ ఫాలో చెయ్యలేదు.

Also read: ఒక కూతురు నిర్మాత, మరో కూతురు హీరోయిన్.. ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్ ఫ్యామిలీ   


ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో, దర్శకుడు కరణ్ జోహార్ ఎట్టకేలకు స్పందిస్తూ నెటిజన్ల నోళ్లకి తాళం వేశాడు. గురువారం రాత్రి  తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక  పోస్ట్ చేసారు. సదరు పోస్ట్ లో 'ఇది కేవలం డిజిటల్ డిటాక్స్  మాత్రమే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నేను వెచ్చించే సమయాన్ని, శక్తిని తగ్గించుకోవడానికే అందరినీ అన్‌ఫాలో చేస్తున్నాను. అంతేకానీ దీని వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవు. దీన్ని దేశవ్యాప్త సంచలన వార్తగా మార్చకండి. దయచేసి క్లిక్‌, బైట్ కోసం వేరే అంశాలను చూసుకోండి అని చెప్పాడు. కొంత ముందైతే  కరణ్ జోహార్ చెప్పిన మాటల్ని నమ్మడం లేదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com