English | Telugu

విజార్డ్రీ స్కూల్ లో అడ్మిషన్ పొందిన గీతూ రాయల్


గీతూ రాయల్ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. అలాగే రకరకాల మోటివేషనల్ వీడియోస్ తో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాంటి గీతూ ఇప్పుడు హోగ్వార్ట్స్ విచ్‌క్రాఫ్ట్ & విజార్డ్రీ స్కూల్ కి వెళ్తోంది. ఈ స్కూల్ పేరు హ్యారి పాటర్ చూసిన ప్రతీ ఒక్కరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ స్కూల్ నుంచి గీతూకు ఇన్విటేషన్ వచ్చింది. హ్యారి పాటర్ సిరీస్ గురించి చెప్పాలంటే అదొక అద్భుతమైన ఇంద్రజాలం.. జెకె.రౌలింగ్ తన నెరేషన్ తో చిన్నా పెద్దా అందరినీ కట్టిపడేసింది.

ఇప్పుడు అలాంటి స్కూల్ నుంచి ఇన్విటేషన్ వచ్చేసరికి గీతూ ఖుషీగా ఉంది. "డియర్ గీతూ రాయల్ మీరు హోగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ - విజార్డ్రీ స్కూల్ లో జాయిన్ అయ్యే అవకాశం రావడం నిజంగా ఆశ్చర్యకరం.. ఏమైనప్పటికీ, మీకు అభినందనలు ! దయచేసి మీకు చెప్పిన బుక్స్, ఎక్విప్మెంట్ అన్నీ తెచ్చుకోండి..మీరు మ్యాజిక్, మాయలు నేర్చుకునే టర్మ్ 1 సమయం జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఉంటుంది. హోగ్వార్ట్స్ తన స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త వాట్సాప్ నంబర్ ని క్రియేట్ చేసింది ..కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే మీరు అందులో రిజిస్టర్ చేసుకోండి" అని ఆ లెటర్ లో రాసి పంపింది హోగ్వార్ట్స్ విచ్‌క్రాఫ్ట్ & విజార్డ్రీ స్కూల్ టీమ్. అలాగే ఇక్కడ మాంత్రిక ప్రొఫెసర్‌ల ఫ్యాకల్టీ ఉంటుంది. వాళ్ళు మ్యాజిక్ కూడా నేర్పిస్తారు. ఈ పాఠశాల గ్రేట్ బ్రిటన్‌లో ఉంది. ఇక ఈ స్కూల్ కి వెళ్లే స్టూడెంట్ గా గీతూ గుడ్లగూబ, పిల్లి , అడ్మిషన్ లెటర్, మంత్రదండం, సబ్జెక్ట్ పుస్తకాలు, డ్రాగన్ గ్లోవ్స్, సాదా నల్లటి టోపీ తీసుకెళ్ళాలి. నల్ల రంగు యూనిఫారం తప్పనిసరిగా పేరును ట్యాగ్‌ చేసి వేసుకోవాలి. ఇప్పుడు గీతూ ఇవన్నీ తీసుకెళ్లి మ్యాజిక్ నేర్చుకోబోతోంది.