English | Telugu

అత్తని కాంప్రమైజ్ చేసిన కోడలు.. బాబు తల్లిని ఆమె తీసుకురాగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మమడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -407 లో.. నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను చేసిన తప్పు కి రాజ్ శిక్ష అనుభవిస్తున్నాడు.. రేపు ఎలాగైనా అపర్ణకి నిజం చెప్పి క్షమించమని అడుగుతాను.. అనవసరంగా కావ్య, రాజ్ ఇద్దరు అవమానపడుతున్నారని సుభాష్ అనుకుంటాడు.

మరొకవైపు ఆ స్వప్న కావాలనే కొట్టిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. నువ్వే అలా అంటే నా పరిస్థితి చూడు మమ్మీ అంటూ రాహుల్ అంటాడు. ఈ విషయం పక్కన పెట్టు కానీ ఈ రోజు అపర్ణ వదిన రాజ్ నిజం చెప్పకుంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పింది కదా పద కిందకి వెళదామని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అపర్ణ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నావా అపర్ణ అని సుభాష్ అనగానే.. మీ వంశోద్దారకుడు రానివ్వండి.. వాడు వెళ్ళాలో? నేను వెళ్లాలో? అందరూ కలిసే ఉండాలో తెలుస్తుందని అపర్ణ అంటుంది అప్పుడే రాజ్ వచ్చి.. నా మూలంగా మాటలు పడి ఇంట్లో నుండి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదని రాజ్ అంటాడు.. అర్థం అయింది ఇక నువ్వు నిజం చెప్పవు. ఏం చేసినా చెప్పావ్ .. ఇక నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అపర్ణ వెళ్లిపోతుంటే.. ఆగు అపర్ణ వెళ్లేముందు కొన్ని నిజాలు తెలుసుకోవాలని సుభాష్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రాజ్ తప్పు చేశాడు.. నిజం చెప్పడం లేదని అనుకుంటున్నావు అంతే తప్పు వాడు నిజం చెప్పకపోవడానికి కారణం ఏంటని ఆలోచించడం లేదు.. ఈ రోజు రహస్యం బట్టబయలు కావాలి.. అసలు రాజ్... అంటూ సుభాష్ నిజం చెప్పబోతుంటే.. కావ్య ఆపుతుంది. ఇప్పుడు నేను అడగాలంటూ నిజం చెప్పకుండా ఆపి తెలివిగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే.. నేను అడిగే అర్హత ఉండదు. అందుకే కొన్ని లెక్కలు తేల్చాలని కావ్య అంటుంది.. మీరు ఏం తప్పు చేశారు.. పిరికితనంతో వెళ్ళిపోతున్నారు.. మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోతే పిల్లి కూడా పులి అవుతుంది. ఇన్ని రోజులు మీ మాట మీద ఈ కుటుంబం ఉంది.. ఇప్పుడు వెళ్ళిపోతే ఎవరి పెత్తనం వాళ్ళదని కావ్య చెప్పగానే.. సరే ఉంటాను కానీ ఆ బాబు గురించి నిజం బయటపెట్టె సత్తా నీకుందా అని కావ్యని అపర్ణ అడుగుతుంది. తరువాయి భాగంలో.. కావ్యకి సుభాష్ నిజం చెప్పబోతుంటే.. నాకు అంతా తెలుసు మావయ్య.. అందుకే మిమ్మల్ని చెప్పకుండా ఆపానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఆ బాబు తల్లి ఎక్కడున్నా తీసుకొని వచ్చి.. మీ అమ్మ ముందు నిల్చొపెడతాను.. మీరు మాత్రం నాకు అడ్డురాకండి అని రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.