English | Telugu

Kalyan Padala Bigg Boss Journey: గూస్ బంప్స్ తెప్పించిన కళ్యాణ్ పడాల జర్నీ వీడియో!


రైట్ సోల్డర్ ఇన్ రైట్ ప్లేస్ అంటూ నాగార్జున చెప్పిన మాటలతో మొదలైన కళ్యాణ్ పడాల జర్నీ వీడియో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది జర్నీ వీడియోలా లేదు.. డైరెక్ట్ సీజన్-9 విన్నర్ ఇతనే అని అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా ఉంది.

బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్-9 ముగుస్తుంది. ఆదివారం ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, తనూజ టాప్-5 లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు విజేత అవుతారో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే. అయితే నిన్నటి(శుక్రవారం) నాటి ఎపిసోడ్ లో కళ్యాణ్ పడాల జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ముందుగా కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పాడు.. మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు.. జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ.. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కొన్ని కోట్ల మంది ప్రేమని పొందే అవకాశం లభిస్తుంది.. దాన్ని మీరు అగ్నిపరీక్షని దాటి సొంతం చేసుకున్నారు .. ఇప్పుడు వారి ప్రేమని పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారని బిగ్ బాస్ చెప్తుంటే కళ్యాణ్ అయితే విజిల్స్.. కేకలు వేశాడు.

ఇక చివరగా బిగ్ బాస్ ఓ మాట చెప్పాడు. లోటుపాట్లన్నీ సరిచేసుకొని చివరి కెప్టెన్‌గా నిలవడమే కాకుండా మొదటి ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు.. లక్ష్మణ్ రావ్ లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటివరకూ.. కానీ వీళ్లు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు.. గొప్ప కలలు కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కి దిక్సూచిగా నిలిచి స్ఫూర్తినిచ్చారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఆ తర్వాత జర్నీ వీడియోలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నీవే నీవే అని పాట వేయగా, శ్రీజ, ప్రియా, డీమాన్ పవన్ లతో గొడవలు, ఆటలు అన్నింటికి మహర్షి సినిమాలోని చోటి‌ చోటి చోటి బాతే అని పాట వేశాడు. తనూజతో లవ్ సాంగ్ వేశాడు. ఇక చివరగా సైనిక పాటతో గూస్ బంప్స్ తెప్పించాడు బిగ్ బాస్. మొత్తంగా ఈ జర్నీ వీడియోతో పవన్ కళ్యాణ్ పడాల సీజన్-9 (Bigg Boss 9 Telugu winner) విన్నర్ అనే విషయం బిగ్ బాస్ మామ చెప్పేశాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.