English | Telugu

కార్ కొన్న తేజస్విని...సెలెబ్రేట్ చేసుకున్న ఫ్రెండ్స్


అమరదీప్ - తేజస్విని గౌడ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద క్యూట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. తేజస్విని కన్నడ ఇండస్ట్రీ నుంచి రాగా అమర్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి . ఇలా వీరిద్దరు పలు సీరియల్స్ లో నటిస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఐతే అమర్ దీప్ రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లి వచ్చాడు. అమర్ బయటకు వచ్చే టైంలో ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు.

కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో నటించింది తేజు. అమరదీప్ సీరియల్స్, ఓటిటి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తేజు కొత్త కార్ కొన్నది. సుమారు 27 లక్షల ఖరీదు చేసే టాటా సఫారీ కొని ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అమర్ - తేజు ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్లి షో రూమ్ లో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. అందరూ కూడా తేజుకి విషెస్ చెప్తున్నారు. కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది తేజస్విని గౌడ . ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ లో చిన్ని రోల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. అలాగే విజయ్ టీవీలో 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది తేజస్విని. తేజు- అమర్ ది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. కోయిలమ్మ సీరియల్ టైములో మొదట అమరదీప్ తనకి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశానని.. కానీ మూడేళ్ళ పాటు తన కోసం వెయిట్ చేసాడని చెప్పింది. ఫైనల్ గా అమర్ వచ్చి ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తేజు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.