English | Telugu
యష్ - వేదల పెళ్లిని ఆపడానికి అభిమన్యు - మాళవిక ఏం చేశారు?
Updated : Feb 23, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా అలరిస్తున్న ఈ సీరియల్ గురువారం ఆసక్తికర మలుపులు తిరగబోతోంది. ఈ రోజు హైలెట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద వేసుకున్న మేకప్, డ్రెస్సింగ్ చూసి ఖుషీ కోసమే పెళ్లి అన్నావ్.. ఇప్పుడు ఇలా రెడీ అవుతున్నావ్ అంటూ యశోధర్ కామెంట్ చేస్తాడు. ఆటపట్టించడం కోసం మాలిని కూల్ డ్రింక్ లో మందు కలిపి వేద ఫ్యామిలీని తాగమంటుంది. వేద తల్లి సులోచన అందుకు అంగీకరించకపోవడంతో తాను హర్ట్ అయ్యానని డ్రామా మొదలుపెడుతుంది మాలిని. దాంతో వేద ఫ్యామిలీ తాగాల్సి వస్తుంది.
Also Read:'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బయటకు వచ్చేసిన వనిత!
ఇక సంగీత్ చిత్ర, వసంత్ ల డ్యాన్స్ తో మళ్లీ మొదలవుతుంది. కట్ చేస్తే వేదని గిఫ్ట్ తో పడేయాలని మాళవిక నెక్లెస్ తీసుకుని వేద సంగీత్ ఫంక్షన్ కి బయలుదేరుతుంది. ఫంక్షన్ హాల్ కి చేరుకున్న మాళవిక కంగారులో కార్ లాక్ తో పాటు నెక్లెస్ బాక్స్ తీసుకోవడం మర్చిపోతుంది. ఈ లోగా కార్ లాక్ అవుతుంది. సెక్యూరిటీతో చెప్పి కార్ డోర్ లాక్ తీయించిన మాళవిక వేద కోసం తీసుకొచ్చిన నెక్లెస్ బాక్స్ తీసుకుని ఫంక్షన్ హాల్ లోకి ప్రవేశిస్తుంది. అప్పటికే యశోధర్ వీరబిల్డప్ ఇస్తూ డ్యాన్స్ నేనే అదరగొట్టానని వేద ముందు పోజు కొడుతుంటాడు.
Also Read:సంగీత్‌లో యష్ - వేద అడ్డంగా దొరికిపోయారా?
ఆ బిల్డప్ లు చూసి వేద మరీ ఎక్కువైంది అంటూ కళ్లతోనే చెప్పేస్తుంది. ఆ తరువాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఇంతలో సంగీత్ ఫంక్షన్ లోకి మాళవిక ఎంట్రీ ఇస్తుంది. యష్ పెళ్లి చేసుకోబోయేది వేదనే అని తెలుసుకుని షాక్ అవుతుంది. వెంటనే ఆ విషయాన్ని అభిమన్యుకి చెబుతుంది. ఆ తరువాత యష్ - వేదల పెళ్లిని ఆపడానికి అభిమన్యు - మాళవిక ఏం చేశారు? .. అందుకు ప్రతిగా యష్ ఎలాంటి ప్లాన్ వేశాడన్నది ఈ రోజు చూడాల్సిందే.