English | Telugu

సుధీర్ పెళ్లాడిన ఈ అమ్మాయి ఎవరు?

బుల్లితెరపై సుధీర్-రష్మి జోడీకి మంచి క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీకి, లవ్ ట్రాక్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పటికే పలుసార్లు షోలలో పెళ్లి కూడా జరిగింది. కానీ అది నిజం కాదు. ఊరికే ప్రేక్షకులను అలరించడం కోసం, స్క్రిప్ట్ ప్రకారం షో కోసం అలా చేశారు. అయితే తాజాగా మరోసారి సుధీర్ పెళ్ళికొడుకు అవతారమెత్తాడు. ఈసారి రష్మికి బదులుగా వేరే అమ్మాయిని పెళ్లాడాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అంటూ చర్చలు మొదలయ్యాయి.

సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో సుధీర్ కి ఒకమ్మాయితో పెళ్లి జరిగినట్లుగా చూపించారు. ఇద్దరూ రింగ్స్, దండలు మార్చుకోవడం ప్రోమోలో కనిపించింది. ఇక ఈ ప్రోమోలో సుధీర్ ని పెళ్లాడినట్లు కనిపించిన అమ్మాయి గతంలో వేరే షోలలో కనిపించలేదు. కొత్తగా కనిపిస్తుంది. పైగా ఆమె సుధీర్ ని చూసి సిగ్గుపడటం, మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తుంటే ఈసారి సుధీర్ కి నిజంగానే పెళ్లయిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి ప్రాంక్స్ ఇప్పటికే ఎన్నో చూశాం, ఈసారి మరో కొత్త అమ్మాయితో ప్రాంక్ ప్లాన్ చేశారని అంటున్నారు.

సుధీర్ కి ఈసారైనా నిజంగా పెళ్లయిందా లేదో? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.