English | Telugu

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.

వెంటనే మీరు మా రెస్టారెంట్ కి రండి.. జనరల్ మేనేజర్ ని చేస్తానని వైరా అనగానే కాశీ షాక్ అవుతాడు. నేను మా సీఈఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కాశీ అంటాడు. నువ్వు మంచి పొజిషన్ లో ఉండి నిన్ను అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్పాలని కాశీని రెచ్చగొట్టేలా వైరా మాట్లాడతాడు. మరొకవైపు కార్తీక్ దీప వస్తుంటే దారిలో జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ కనిపిస్తాయి. ఫుడ్ ప్రజలకి పంచడం చూసి దీప హ్యాపీ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి వైరా ఫోన్ చేస్తాడు. ఒకసారి కాశీతో మాట్లాడమని ఫోన్ ఇస్తాడు. కాశీ ఇది మంచి ఛాన్స్ ఎవరి దగ్గరో పని చెయ్యాల్సిన అవసరం లేదు.. నీకంటూ సొంత ఇల్లు, జాబ్, కార్ ఇలాంటి అవకాశం రాదని చెప్తుంది. వైరాకి కాశీ ఒకే చెప్తాడు. మరొకవైపు శ్రీధర్ ఫుడ్ ట్రక్స్ గురించి మీడియాతో మాట్లాడుతాడు. వాళ్ళు గొప్పగా మాట్లాడుతుంటే శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పోలీసులతో కాశీ వస్తాడు. మీరు డిస్టిబ్యూట్ చేసిన ఫుడ్ లో కల్తీ అయి అందరు అస్వస్థతకి గురై అయ్యారు.. ఏంటని అడిగితే మీ పిఏ మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. మీరు స్టేషన్ కి రండి అని శ్రీధర్ ని‌ పోలీసులు తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత దీప ఇల్లు తుడుస్తుంటే అప్పుడే సుమిత్ర వచ్చి తన చేతిలో చీపురు లాక్కొని నువ్వు కూర్చొ నేను చేస్తానని అంటుంది. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుమిత్ర దగ్గుతు ఉంటే ఏమైందని దశరథ్ వస్తాడు. ఇద్దరు కలిసి సింక్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సుమిత్ర దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది. అది సుమిత్ర చూడకముందే దశరత్ వాటర్ పోస్తాడు. అది చూసి దీప షాక్ అవుతుంది. సుమిత్రని లోపలికి పంపిస్తారు. ఈ విషయం మళ్ళీ సుమిత్రతో అనకు అని దశరథ్ అంటాడు. మా అమ్మకి ఏమైందని దీప టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.