English | Telugu

Illu illalu pillalu: అమూల్యకి వార్నింగ్ ఇచ్చిన చందు.. శ్రీవల్లి ఫిట్టింగ్ పెట్టిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో..... సాగర్, నర్మద మధ్య గొడవ పెట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది. పాపం సాగర్ నువ్వు రైస్ మిల్ లో పనిచేస్తున్నావని నర్మద చాలా ఫీల్ అవుతుంది. నాతో చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. మళ్ళీ నేను అన్నట్లు తనతో చెప్పకండి ఎందుకంటే మళ్ళీ మా మధ్యలో గొడవలు వస్తాయని శ్రీవల్లి అనగానే అప్పటికే సాగర్ కి కోపం వస్తుంది.

మరొకవైపు అమూల్య కోసం విశ్వ వెయిట్ చేస్తాడు కానీ అమూల్యని చందు కాలేజీకి తీసుకొని వస్తాడు. అమూల్య నాన్న గురించి తెలుసు కదా తలదించుకొని వచ్చామా.. వెళ్ళామా అన్నట్లు ఉండాలి.. కుటుంబం తలదించుకునే పరిస్థితి తీసుకొని రావద్దని చందు వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు నీ వయసు అలాంటిది అట్రాక్షన్ ఉంటుంది.. జాగ్రత్త అని చందు వెళ్ళిపోతాడు. అదంతా విశ్వ చూసి అమూల్య దగ్గరికి వచ్చి ఏంటి మీ అన్నయ్య కోపంగా మాట్లాడుతున్నాడని అడుగుతాడు. మనపై డౌట్ వచ్చినట్లు ఉందని అమూల్య చెప్పగానే.. నువ్వు ముందు కాలేజీకి వెళ్ళమని అమూల్య ని పంపిస్తాడు. శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి మీ ఆయనకి డౌట్ వచ్చిందని అంటాడు. డౌట్ కాదు మిమ్మల్ని పార్క్ లో చూసాడని శ్రీవల్లి అంటుంది. ఇక ఆలస్యం చెయ్యను లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటా.. నువ్వు హెల్ప్ చెయ్యాలని అనగానే ఒరేయ్ బండోడా ఏం మాట్లాడుతున్నావ్ రా అని విశ్వపై శ్రీవల్లి కోప్పడుతుంది.

మరొకవైపు సేనాపతి ఇంకా ఇంటికి రాలేదని రేవతి టెన్షన్ పడుతుంది. ఆ విషయం తెలిసి ప్రేమ స్కూటీ తీసుకొని వెళ్లి వాళ్ళ నాన్నని వెతుకుతుంది‌ ఒక దగ్గర తాగేసి ఉంటే తనని ఆటోలో ఇంటికి తీసుకొని వస్తుంది. అది శ్రీవల్లి చూసి ధీరజ్ కి చెప్తుంది. ప్రేమ, వాళ్ళ నాన్నని లోపలికి తీసుకొని వెళ్తుంటే.. ధీరజ్ చూసి షాక్ అవుతాడు. పాపం ప్రేమ ఇక్కడున్నా తన మనసు అంత వాళ్ళింట్లోనే ఉంటుందని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో రేయ్ ధీరజ్.. రా భోజనం చేద్దామని ప్రేమ అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..