English | Telugu
'అన్ స్టాపబుల్-2'తో బాలయ్య సంచలన రికార్డు!
Updated : Oct 19, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో సీజన్-2 ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయింది. రెండో సీజన్ కి మొదటి సీజన్ ని మించిన రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ఫస్ట్ ఎపిసోడ్ సంచలనాలు సృష్టిస్తోంది.
'అన్ స్టాపబుల్-2' మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు నారా లోకేష్ కూడా సందడి చేశారు. ఆ ఇద్దరితో బాలయ్య ముచ్చటించిన తీరు ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 14 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలనం సృష్టించింది. ఓ టాక్ షోకి ఓటీటీలో ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.
'అన్ స్టాపబుల్-2' నుంచి ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల కానుంది. అక్టోబర్ 21న స్ట్రీమింగ్ కానున్న రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మూడో ఎపిసోడ్ లో రమ్యకృష్ణ, రాశి ఖన్నా పాల్గొనబోతున్నారని సమాచారం.