English | Telugu
ఒకరి తప్పులు మరొకరు చెప్పుకుని కొట్టుకున్నారు... నచ్చిన విషయాలు చెప్పి తీపి తినిపించుకున్నారు
Updated : Oct 19, 2022
మిస్టర్ అండ్ మిస్సెస్ షోకి సిద్దు-విష్ణుప్రియ, రవి-సుష్మకిరణ్, రాకేష్-సుజాత, ఆట సందీప్-జ్యోతి ఎంట్రీ ఇచ్చారు. మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో స్టేజి మీదకు వచ్చేసారు. కొంచెం ఇష్టం - కొంచెం కష్టం అనే సెగ్మెంట్ ఒకటి ఈ షోలో పెట్టారు. ఈ సెగ్మెంట్ లో సుత్తి-గులాబీ పూలు ఇచ్చారు. ఏ విషయంలో కోపం వస్తుందో చెప్పి సుత్తితో ఒక దెబ్బ కొట్టడం, ఏ విషయంలో హ్యాపీనెస్ వస్తుందో అప్పుడు ఒక గులాబీ ఇవ్వాలి అనే టాస్క్ ఉంది. సిద్దు-విష్ణుప్రియ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. "ఆల్రెడీ సర్దిన బట్టలే సర్ది నన్ను మా అమ్మతో తిట్టిస్తుంది విష్ణు అప్పుడు కొట్టాలనిపిస్తుంది అని సుత్తితో కొట్టాడు. ఇక సిద్దు గురించి చెప్పాలంటే స్నానం చేసాక తుడుచుకున్న టవల్ కూడా అక్కడే పడేస్తాడు అది నాకు నచ్చదు" అని సుత్తితో కొట్టింది విష్ణు.
ఇక తర్వాత ఈ సెగ్మెంట్ కి రవికిరణ్-సుష్మ వచ్చారు. వీళ్లకు కొంచెం ఇష్టం-కొంచెం కష్టం సెగ్మెంట్ లో "డబ్బులు ఎక్కువ ఖర్చుపెడతానని ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడు అని రవికి ఒక్కటిచ్చింది..సుష్మ ఇంట్లో పని చేయకుండా ఎప్పుడూ ఇన్స్టా లో రీల్స్ చేస్తూనే ఉంటుంది" అని చెప్పాడు రవి. తర్వాత ఆట సందీప్-జ్యోతికి ఈ సెగ్మెంట్ లో రొట్టెల కర్ర, లడ్డులు పెట్టారు. "ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అవ్వమంటే గంటలు గంటలు రెడీ అవుతుంది అప్పుడు ఈ కర్రతో కొట్టాలనిపిస్తుంది అని జ్యోతి నెత్తి మీద ఒక్కటిచ్చాడు. సందీప్ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటాడు. దాంతో సమస్యలు వస్తాయి అంటూ కర్రతో ఒక్కటి ఇచ్చింది. ఇక ఎప్పుడు ప్రేమొస్తుంది అంటే మా నాన్నకు జీపే చేసినప్పుడు ప్రేమొస్తుంది" అంటూ లడ్డు తినిపించింది. ఇలా గత వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.