English | Telugu
ఇనయా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Updated : Oct 19, 2022
బిగ్ బాస్ లో ఇనయా అంటే ఇప్పుడు తెలియని వారు లేరు. ఇనయా పరిచయం అక్కరలేని పేరు. ఈమె పూర్తి పేరు ఇనయా సుల్తానా. ఈమె 1995 అగష్టు 21 న ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఈమెకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే మక్కువ ఎక్కువ. తన తండ్రి ఇండస్ట్రీకి వచ్చి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తిరిగి వెళ్ళిపోయాడంట. తన నాన్న చనిపోయాడు. అందుకే తన నాన్నకి గుర్తుగా తన పేరు చివరన ఇనయా ముజిబుర్ రహమాన్ అని కలుపుకొని చెప్పుకుంటుందంట. కాగా తను ఇండస్ట్రీకి రావడం, ఇంట్లో ఎవరికి ఇష్టం లేదంట. దీంతో ఇంటి నుండి ఒక వంద రూపాయలతో బయటకొచ్చిందంట.
మొదటగా తన కెరియన్ ని మోడల్ గా స్టార్ట్ చేసి, తర్వాత మెల్లి మెల్లిగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయట. ఆ తర్వాత 2021లో 'ఎవమ్ జగత్' లో, తర్వాత 'బుజ్జి ఇలా రా', ఆ తర్వాత 'యద్భావం తధ్భావం', ఇంకా కొన్ని సినిమాల్లో నటించింది. అటు మోడల్ గా, ఇటు నటి గా రాని పాపులారిటీ, ఒక్క వీడియోతో ఫేమస్ అయింది. అది ఏ వీడియో అంటే కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో చేసిన డ్యాన్స్ వీడియో. అందులో రామ్ గోపాల్ వర్మ తన కాళ్లు పట్టుకున్నాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారి పాపులర్ అయింది. కాగా ఇప్పుడు అదే బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చేలా చేసిందని పులువురు అనుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా అడుపెట్టింది. అయితే హౌస్ లో ఎక్కువ పెర్ఫార్మన్స్ లేకపోయినా కూడా గొడవలకు అవకాశం ఎక్కువగానే ఇచ్చింది. కాగా ఇప్పుడు హౌస్ లో ఎక్కువగా సూర్యతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాకుండా "సూర్య నా క్రష్" అని చెప్పేసింది. ఎప్పుడు సూర్య వెంట ఉంటూ కనిపిస్తోంది. శ్రీహాన్ తో మాత్రం మొదటి వారం నుండి తగాదాలు అనే చెప్పాలి. రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య గొడవ ముదురుతుందే కానీ తగ్గట్లేదు. అయితే ప్రస్తుతం వేస్ట్ పరఫార్మెన్స్ తో ప్లాప్ గా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పుడిప్పుడే హౌస్ లో పెర్ఫార్మన్స్ మొదలు పెట్టింది అని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు నామినేషన్లో ఉంది.
ఇనయా రెమ్మునెరేషన్ రోజుకి ఇరవై అయిదు వేల నుండి ముప్పై వేల వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇనయ చివరి వరకు ఉండి వాళ్ళ నాన్నకి గొప్ప కీర్తిని తీసుకొస్తుందో? లేదో చూడాలి మరి.