English | Telugu
ఎవరు ఆపుతారో చూద్దామన్న బాలయ్య... మంచు లక్ష్మీతో స్టెప్పులు!
Updated : Nov 1, 2021
"నేను మీకు తెలుసు... నా స్థానం మీ మనసు" అన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తొలిసారి ఆయన ఓ టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న 'అన్ స్టాపబుల్'కు ఆయన హోస్ట్. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఆదివారం ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పెద్ద కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి 'అన్ స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ గెస్టులు. మోహన్ బాబు, బాలకృష్ణ మధ్య సంభాషణలు చాలా సరదాగా సాగాయి... ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు ఇద్దరి ముఖాలు సీరియస్ అయ్యాయి. అయితే... అంతకుముందు హీరోగా మోహన్ బాబు ఎదుర్కొన్న ఇబ్బందులను నుంచి సాయంత్రం ఏడు తర్వాత (ఏక్ పెగ్ లా... సాంగ్ నేపథ్యంలో వినిపించింది) వచ్చే టాపిక్స్ వరకు చాలా డిస్కస్ చేశారు.
మోహన్‌బాబు సమక్షంలోనే లక్ష్మీ మంచుతో కలిసి 'దంచవే మేనత్త కూతురా...' పాట కు బాలకృష్ణ స్టెప్పులు వేశారు. 'అనిపించింది అందాం... అనుకున్నది చేద్దాం ... ఎవరు ఆపుతారో చూద్దాం' అంటూ తనదైన శైలిలో బాలకృష్ణ డైలాగులు చెబుతూ షోను రక్తి కట్టించారు.